- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్త్రీ ఆనందం, కన్నీళ్లు, పాఠాలు.. అన్ని భావోద్వేగాలతో ప్రేక్షకులను కన్నీరు పెట్టిస్తున్న ‘8 వసంతాలు’ ట్రైలర్
కేరళ కుట్టి అనంతిక సనీల్ కుమార్(Anantika Sunil Kumar) తెలుగులో అనతికాలంలోనే ఫుల్ పాపులారిటీ సొంతం చేసుకుని హీరోయిన్‌గా ఇండస్ట్రీలో రాణిస్తోంది.

దిశ, సినిమా: కేరళ కుట్టి అనంతిక సనీల్ కుమార్(Anantika Sunil Kumar) తెలుగులో అనతికాలంలోనే ఫుల్ పాపులారిటీ సొంతం చేసుకుని హీరోయిన్‌గా ఇండస్ట్రీలో రాణిస్తోంది. ఒకే ఒక్క ప్రాజెక్ట్‌తో క్రేజీ బ్యూటీగా మారి వరుస అవకాశాలు అందుకుంటోంది. ప్రస్తుతం అనంతిక, ఫణీంద్ర నర్సెట్టి(Phanindra Narsetti) కాంబోలో లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘8 వసంతాలు’(8 Vasantalu) రాబోతుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేనీ, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో.. తాజాగా, చిత్రబృందం ‘8 వసంతాలు’చిత్రం ట్రైలర్‌ను షేర్ చేశారు. ఇక ఇందులో ‘‘పేగు పంచుకొని ప్రాణం పోసే మాకు.. చితికి మంట పెట్టి మోక్షం కల్పించే హక్కు లేదా.. ప్రేమ అనేది జీవితంలో ఒక దశ మాత్రమే.. అదే దిశ కాదు.. మగాడి ప్రేమకు సాక్షాలుగా పాలరాతి సౌదాలు, భాగ్యనగరాలున్నాయి.
ఆడదాని ప్రేమకు ఏముంది మనసులో సమాధి చేసుకున్న జ్ఞాపకాలు తప్ప’’ అని చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను కన్నీరు పెట్టేలా చేస్తున్నాయి. ఇక ఈ ట్రైలర్‌కు మేకర్స్ స్త్రీ, ఆనందం, కన్నీళ్లు, పాఠాలు అన్ని భావోద్వేగాలతో మూవీ రాబోతున్నట్లు తెలిపారు. కాగా, అనంతిక ప్రమోషన్స్‌లో భాగంగా ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘ఇలాంటి అందమైన ప్రేమకథా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఇప్పుడు కుదిరింది. ఈ స్టోరి విన్నప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నాను. నేను కోరుకున్న ప్రతి అంశం ఉండటంతో ఒప్పుకున్నా. ఈ సినిమా కోసం నేను కళరి అనే ఫైట్ కూడా నేర్చుకున్నాను. కానీ నా ఆశయం మాత్రం.. రాజకీయ నాయకురాలు కావడమే. అందుకే న్యాయ విద్యను చదువుతున్నా. నాకు 40 ఏళ్లు వచ్చాకే పాలిటిక్స్‌లోకి వస్తాను’’ అని చెప్పుకొచ్చింది.






