- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
థియేటర్లలోకి విజువల్ వండర్.. ‘లవ్ అండ్ వార్’ తో భన్సాలీ భారీ ప్లాన్!
చిత్ర యూనిట్ ప్రేక్షకులకు ఒక తీపి కబురు అందించింది. ‘లవ్ అండ్ వార్’ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది.

దిశ, సినిమా: భారతీయ చలనచిత్ర రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసిన స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ. ఆయన నుండి సినిమా వస్తోందంటే చాలు.. అది ఒక అద్భుత దృశ్యకావ్యంలా ఉంటుందని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. ప్రస్తుతం భన్సాలీ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘లవ్ అండ్ వార్’ . ఈ సినిమా కోసం సినీ ప్రియులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఇందులో బాలీవుడ్ టాప్ స్టార్స్ రణబీర్ కపూర్, ఆలియా భట్, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వీరి ముగ్గురి కలయికలో సినిమా అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భన్సాలీ మార్క్ ప్రేమకథకు ఈ స్టార్ కాస్టింగ్ తోడవ్వడం సినిమాపై హైప్‌ను అమాంతం పెంచేసింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లకు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా ఈ చిత్ర యూనిట్ ప్రేక్షకులకు ఒక తీపి కబురు అందించింది. ‘లవ్ అండ్ వార్’ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. వచ్చే ఏడాది 2027 రిపబ్లిక్ డే కానుకగా.. జనవరి 21వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. లాంగ్ వీకెండ్‌ను క్యాష్ చేసుకునేలా మేకర్స్ ఈ డేట్‌ను లాక్ చేశారు. ఎప్పటిలాగే భన్సాలీ సినిమాల్లో ఉండే భారీ సెట్టింగ్స్, అద్భుతమైన విజువల్స్, గుండెల్ని పిండేసే ఎమోషన్స్‌తో ఈ సినిమా రూపొందుతోంది. కేవలం హిందీలోనే కాకుండా, దక్షిణాది ప్రేక్షకుల కోసం తెలుగు, తమిళ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. అంటే, ఇదొక ప్రాపర్ పాన్ ఇండియా విజువల్ ట్రీట్ అన్నమాట.






