- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్టార్ నటికి ఖరీదైన బహుమతి ఇచ్చిన స్పెషల్ పర్సన్.. ప్రపంచంలోనే నువ్వు బెస్ట్ పార్ట్‌నర్ అంటూ ఎమోషనల్ పోస్ట్

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో శరత్ కుమార్ కూతురిగా వరలక్ష్మి(Varalakshmi Sarath Kumar) సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయింది. ‘పోడాపోడి’చిత్రంతోహీరోయిన్‌గా మారి తమిళంలో వరుస ప్రాజెక్ట్స్ చేసి ప్రేక్షకులను అలరించింది. ఇక తెలుగులో పందెం కోడి, క్రాక్, వీర సింహారెడ్డి(Veerasimha Reddy) వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. ఇక గత ఏడాది తేజ సజ్జా హీరోగా నటించిన ‘హనుమాన్’(Hanuman) మూవీలో వరలక్ష్మి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించినప్పటికీ ఫుల్ పాపులారిటీని దక్కించుకుంది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు వరలక్ష్మి నటనకు ప్రశంసలు వచ్చాయి. ఇక తమిళంలో రాయన్, మద గజ రాజా వంటి చిత్రాలతో వరుస హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. తెలుగు, తమిళ సినిమాలతో కెరీర్ పీక్స్‌లో ఉండగానే వరలక్ష్మి ముంబైకి చెందిన గ్యాలరీస్ట్ నికోలాయ్ సచ్‌దేవ్‌ను పెళ్లి చేసుకుంది.
ఆ తర్వాత నుంచి ఇండస్ట్రీకి కాస్త దూరంగా ఉంటుంది. పర్సనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది. అయినప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ పలు ఫొటోలు షేర్ చేస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, వరలక్ష్మి తన భర్తతో కలిసి ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంది. ఆమె భర్త తనకు కారు గిఫ్ట్‌గా ఇచ్చినట్లు తెలుపుతూ ఎమోషనల్ అయింది. ‘‘ఈ ప్రపంచంలో నువ్వు బెస్ట్ మొగుడివి. థాంక్యూ బేబీ ఐ లవ్ యూ’’ అని ఇన్‌స్టా స్టోరీలో పెట్టింది. పోర్స్ 718 బాక్స్‌టర్ మోడల్ పింక్ కలర్ కారు ఇవ్వగా.. దాని ధర రూ1.60 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఆమె కారులో కూర్చొని డ్రైవింగ్ సీట్‌లో ఫొటోలకు పోజిలిచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతుండగా.. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు షాక్ అవుతున్నారు.






