గ్రీన్ సిగ్నల్.. తెలంగాణలో థియేటర్లు ఓపెన్

by  |
గ్రీన్ సిగ్నల్.. తెలంగాణలో థియేటర్లు ఓపెన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఫుల్ కెపాసిటీతో థియేటర్లను ఓపెన్ చేసేందుకు ప్రభుత్వం అనుమతులను జారీ చేసింది. దీంతో ఈ నెల 23 నుంచి థియేటర్లను ప్రారంభించేందుకు సినీ ఎగ్జిబిటర్లు సిద్ధమవుతున్నారు. సెకండ్ వేవ్ ప్రభలినప్పుడు ప్రేక్షకుల ఆరోగ్యం దృష్ట్యా సినిమా ప్రదర్శనలను స్వచ్ఛందంగా నిలిపివేస్తున్నట్టు థియేటర్స్ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది. థియేటర్లలో ఆంక్షలను సడలిస్తూ ప్రభుత్వం నుంచి అనుమతులు రావడంతో తిరిగి ప్రారంభించనున్నారు. ఓ వైపు థర్డ్ వేవ్ ముంచుకొస్తుంది జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్న ప్రభుత్వం థియేటర్లకు ఫుల్ కెపాసిటీతో అనుమతులు మంజూరు చేయడంపై విమర్శులు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలను అప్రమత్తం చేస్తూనే జనాలు ఒకే చోట గుమిగూడేలా థియేటర్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.

థర్డ్ వేవ్ భారిన పడకుండా ఉండాలంటే బోనాలు, బక్రీద్ వేడుకల్లో కోవిడ్ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస రావు సూచిస్తున్నారు. ప్రజల సహకారంతోనే థర్డ్ వేవ్ ను నియంత్రించగలమని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే వైరస్ ప్రభలేందుకు అకాశాలు కల్పిస్తూ ధియేటర్లకు అనుతులిస్తుంది. దాదాపుగా 3 నెలల నుంచి థియేటర్లు మూతపడటంతో సినీ ప్రేక్షకులు థియేటర్లలో సినిమా చూసేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కొత్త సినిమాలు రిలీజ్ అవుతే ఒక్క సారిగా థియేటర్లకు అభిమానులు పోటెత్తనున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భౌతిక దూరం పాటిస్తూ వైరస్ ను కట్టడి చేయడం అసాధ్యం. నిబంధనలను కఠినతరం చేసి వైరస్ ను నియంత్రించాల్సిన ప్రభుత్వం థర్డ్ వేవ్ ను ఆహ్వానించేలా నిర్ణయాలు తీసుకుంటుంది.


Next Story

Most Viewed