‘యూఏఈలో నిఘా సులభం’

by  |
‘యూఏఈలో నిఘా సులభం’
X

దిశ, స్పోర్ట్స్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 యూఏఈకి తరలిపోవడం వల్ల మాకు నిఘా పెట్టడం సులభమవుతుందని బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్ హెడ్ అజిత్ సింగ్ అన్నారు. ‘ఇండియాలో ఈ మెగా లీగ్ 8 వేదికల్లో జరుగుతుంది. ఒక్కోసారి కొన్ని ఫ్రాంచైజీలు రెండు వేదికలు నిర్ణయించుకుంటే ఆ సంఖ్య కూడా పెరుగుతుంది. అప్పుడు మాకున్న సిబ్బందితో అన్ని వేదికల్లో నిఘా పెట్టడం కష్టంగా మారుతుంది. కానీ, ఈ ఏడాది ఐపీఎల్ కేవలం మూడు వేదికలకే పరమితం కానుంది. ప్రేక్షకులను కూడా పరిమిత సంఖ్యలోనే అనుమతించే అవకాశం ఉంది కాబట్టి మేము ఆటగాళ్లపై నిఘా పెట్టడం సులువు అవుతుంద’ని అజిత్ సింగ్ అన్నారు. ఒకసారి పూర్తి షెడ్యూల్ విడుదలైతే మా సిబ్బందిని కూడా దానికి అనుగుణంగా పెంచుతామని చెప్పారు. ప్రస్తుతం బీసీసీఐ పేరోల్స్‌పై ఎనిమిది మంది ఏసీయూ అధికారులు ఉన్నారని, మూడు వేదికలకు వీళ్లు సరిపోతారని అజిత్ స్పష్టం చేశారు. కేవలం స్టేడియాల వద్దే కాకుండా హోటల్స్, శిక్షణా శిబిరాల వద్ద తమ నిఘా ఉంటుందని తెలిపారు. అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు ఐపీఎల్‌లో ఫిక్సింగ్‌కు పాల్పడకుండా ఏసీయూ నిఘాను బీసీసీఐ గత కొన్నేళ్లుగా నియమించింది.

Next Story

Most Viewed