ఈ రాశి ఉద్యోగులకు బోనస్ అవకాశం.. మరి మీదో..

by  |

తేది : 27, సెప్టెంబర్ 2021
ప్రదేశము : హైదరాబాద్, ఇండియా
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : భాద్రపదమాసం
ఋతువు : వర్ష ఋతువు
వారము : సోమవారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : షష్టి (నిన్న మధ్యాహ్నం 1 గం॥ 6 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 43 ని॥ వరకు)
నక్షత్రం : రోహిణి (నిన్న మధ్యాహ్నం 2 గం॥ 35 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 5 గం॥ 41 ని॥ వరకు)
యోగము : సిద్ధి
కరణం : వణిజ
వర్జ్యం : (ఈరోజు ఉదయం 8 గం॥ 39 ని॥ నుంచి 10 గం॥ 27 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు మధ్యాహ్నం 2 గం॥ 4 ని॥ నుంచి 3 గం॥ 52 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు మధ్యాహ్నం 12 గం॥ 30 ని॥ నుంచి 1 గం॥ 18 ని॥ వరకు)(ఈరోజు మధ్యాహ్నం 2 గం॥ 55 ని॥ నుంచి 3 గం॥ 43 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 7 గం॥ 35 ని॥ నుంచి 9 గం॥ 5 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 10 గం॥ 36 ని॥ నుంచి మధ్యాహ్నం 12 గం॥ 6 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 5 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 8 ని॥ లకు
సూర్యరాశి : కన్య
చంద్రరాశి : వృషభము

మేష రాశి : దైవ ప్రార్ధన వలన అన్నీ శుభాలు. ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయండి. ఇతరులతో మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. ఆఫీసు పనిలో ఒత్తిడి శ్రమ. ఆత్మవిశ్వాసం కోల్పోకండి. ముందున్నవి మంచి రోజులు పనులు సకాలంలో పూర్తి చెయ్యడానికి సరైన ప్రణాళిక వేయండి. శ్రమ వలన కంటి నొప్పి మరియు వెన్ను నొప్పి. అత్యవసరాలు కు మాత్రమే ఖర్చు పెట్టండి. ఈ రాశి స్త్రీలకు మీ భర్తతో వాదోపవాదాలకు దిగకండి ఆయన మీ విలువను గుర్తిస్తారు.

వృషభ రాశి : భవిష్యత్తు కొరకు సరైన ప్రణాళికలు వేస్తారు. దైవ ప్రార్థనలు లాభం చేకూరుస్తాయి. మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. ఆఫీసు పనిలో మీ పని సామర్ధ్యం పై అందరూ ప్రశంసలు కురిపిస్తారు పై అధికారుల మెప్పు పొందుతారు. ప్రయాణాలలో వస్తువులు డబ్బు జాగ్రత్త. ఆదాయ వ్యవహారాలు బాగున్నాయి. మరింత సంపాదన కొరకు సరైన పథకాలలో పెట్టుబడులు పెట్టండి. దుబారా ఖర్చులు పెట్టకండి. ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేనప్పటికీ పొట్టలో నొప్పి కొంచెం బాధ పెట్టొచ్చు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త ప్రవర్తన మిమ్మల్ని ఎంతో ఆనంద పరుస్తుంది.

మిధున రాశి : ఆత్మవిశ్వాసం మరియు ఆశావహ దృక్పథం వీటిని ఆచరించండి. ఖర్చులకు సరిపడా ధనం చేతికందుతుంది. అన్ని రకాల పరిస్థితులను ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండండి. ఆఫీసు పనిలో నూతన బాధ్యతల వలన అధిక శ్రమ. పనులను సరైన ప్రణాళికతో పూర్తిచేయండి. అనవసరపు వాదోపవాదాల వలన సమయం వృధా. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేనప్పటికీ అధిక శ్రమ వలన వెన్ను నొప్పి రావచ్చు. ఈ రాశి స్త్రీలకు కుటుంబ బాధ్యతలు పెరిగి ఇబ్బంది పెడతాయి.

కర్కాటక రాశి : అన్నివిధాలా అనుకూలమైన రోజు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడం వల్ల ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. దీర్ఘకాలంగా నడుస్తున్న ఒక కోర్టు కేసు మీకు అనుకూలం. బంధువులు స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ఆఫీసు పనిలో మీ సామర్థ్యంపై పై అధికారులతో సహా అందరూ ప్రశంసలు కురిపిస్తారు. ఆదాయం బాగుంది. మరింత సంపాదన కోసం మీ డబ్బును సురక్షితమైన పథకాల్లో పెట్టుబడులు పెట్టండి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క హాస్యసంభాషణ మిమ్మల్ని మరో లోకం లోకి తీసుకు వెళుతుంది.

సింహరాశి : మీ పట్టుదల సామర్థ్యం మరింత మెరుగు పడతాయి. ఉద్యోగ పరంగా ప్రయాణాలు ఉండవచ్చు ఆదాయం బాగుంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. ఎవరు ఎంత బతిమిలాడినా అప్పు ఇవ్వకండి. ఫిట్ నెస్ కొరకు మీరు చేసిన ప్రయత్నాల వలన మీ ఆరోగ్యం మరింత మెరుగు పడుతుంది. ఆఫీసు పనులను ఒక సరైన ప్రణాళికతో పూర్తిచేయండి. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త మీతో తగినంత సమయం గడపటం మీకు ఆనందాన్ని ఇస్తుంది.

కన్య రాశి : ఈరోజు మీ సామర్థ్యానికి పరీక్ష. ఆత్మవిశ్వాసము పట్టుదల ఉంటే అన్ని సాధిస్తారు. ఆఫీసులో పనులన్నీ ఒక ప్రణాళిక ప్రకారం పూర్తి చేయండి. తోటి ఉద్యోగుల సహాయం లభిస్తుంది. నిర్లక్ష్యం వహిస్తే పై అధికారులతో మాటలు. ఆదాయం బాగుంది. వ్యాపారవేత్తలకే వ్యాపారంలో లాభాలు. కాలాన్ని వృధా చేయకండి. కొంతమందికి వంశపారం పర్యంగా రావలసిన ఆస్తి రావచ్చు. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేనప్పటికీ అధిక శ్రమ వలన వెన్ను నొప్పి. ఈ రాశి స్త్రీలకు మీ భర్తతో ప్రతి చిన్న విషయానికి గొడవ పడటం మీకే నష్టం.

తులారాశి : మీ ఆత్మ విశ్వాసం పూర్తి పై మెట్టులో ఉంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి శ్రద్ధ వహించండి. గందరగోళంలో పడకండి కుటుంబంలో పెద్ద వారి సలహా తీసుకోండి. మీ బంధువుల దగ్గర తీసుకున్న అప్పులు తీర్చి వేస్తారు. కుటుంబ వ్యక్తులు అందరూ కలిసి ఆనందంగా గడుపటం మీకు ఎంతో ఎనర్జీ ని ఇస్తుంది. వ్యాపారంలో మీ భాగస్వాములు అందరూ మీ బిజినెస్ ప్లాన్ ను ఆమోదిస్తారు ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

వృశ్చిక రాశి : మీ ప్రయత్నాలకు అన్నివిధాలా అనుకూలమైన రోజు. కొన్ని చిన్న విషయాలు నిరాశ కలిగించినా కంగారు అక్కరలేదు. నూతన పరిచయాలు. ఆఫీసు పనిలో మీ సామర్థ్యంపై తోటి ఉద్యోగులు ఈర్ష పడతారు పై అధికారులు ప్రశంసిస్తారు. ఆదాయం బాగుంది. అవసరమైన విషయాలకే ఖర్చు పెట్టండి. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. దగ్గు జలుబు మామూలే. ఇతరుల పర్సనల్ వ్యవహారాలలో తలదూర్చవద్దు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త మీకు ఒక గిఫ్ట్ ఇస్తున్నారు ఆనందించండి.

ధనస్సు రాశి : అన్నివిధాలా అనుకూలమైన రోజు. అనారోగ్యం నుండి కోలుకోవడం ఎంతో ఉత్తేజాన్ని ఇస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయండి. మీరు ఇతరులను విమర్శిస్తే ప్రతి విమర్శలు తప్పవు. కొంతమంది ఉద్యోగ మార్పుకై చేస్తున్న ప్రయత్నాలు సఫలమౌతాయి. మీరు చేస్తున్న యోగా మెడిటేషన్ వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆదాయం బాగుంది అవసరాల మేరకు మాత్రమే ఖర్చు పెట్టండి. పెట్టుబడుల కోసం మీ దగ్గరకు ఆకర్షణీయమైన పథకాలతో వస్తారు. పూర్తి వివరాలు తెలియకుండా దిగవద్దు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ఆరోగ్యం మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు.

మకర రాశి : మెడిటేషన్ వలన మీ అనవసరపు ఆలోచనలు అదుపులోకి వస్తాయి. దానివలన ప్రశాంతంగా ఆలోచించగలుగుతారు. ఆఫీసు పనులను పూర్తి చేయడానికి సరైన ప్రణాళిక తప్పనిసరి. పాత బకాయిలు వసూలవుతాయి. దుబారా ఖర్చు వలన ఆదాయం సరిపోకపోవచ్చు. మీ తెలివితేటలు మరియు హాస్యచతురత తో అందరిని ఆకట్టుకుంటారు. మీ మాటలు ఇతరులను బాధపెట్టకుండా ఆలోచించి మాట్లాడండి. ఈ రాశి స్త్రీలకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి దగ్గు జలుబు, తలనొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు.

కుంభరాశి : ముఖ్య నిర్ణయాలను వాయిదా వేయండి. మానసికంగా చికాకులు. దైవ ప్రార్ధన వలన లాభం. విజయం సాధించాలంటే సుఖాలను త్యాగం చేయాలి. ఆఫీసు పనులు సకాలంలో పూర్తి కాకపోవచ్చు. అందువలన సరైన ప్రణాళిక తప్పనిసరి. స్థిరాస్తి అమ్మకం వలన లాభాలు. కుటుంబ అవసరాలకు సరిపడా ఆదాయం ఉండకపోవచ్చు. అనవసరపు ఖర్చులను తగ్గించుకోండి. దూరపు బంధువుల నుంచి వచ్చిన ఒక వార్త కుటుంబాన్ని సంతోషం లో ముంచెత్తుతుంది. ఈ రాశి స్త్రీలకు మీ భర్తతో ఒక విషయం మీద వాదోపవాదాలు జరగవచ్చు.

మీన రాశి : మీ తల్లిదండ్రులు మీ యొక్క జల్సా దుబారా ఖర్చు మీద లెక్చర్ ఇస్తారు. అతి సుఖాలను వదులుకుంటే మంచిది. బంధువులు సహోదరుల నుంచి సపోర్ట్ అందుతుంది. ఆఫీసులో పనులన్నింటిని ఒక సరైన ప్రణాళికతో పూర్తిచేయండి. అవసరాలకు సరిపడా ఆదాయం. కొంత మంది ఉద్యోగులకు బోనస్ అవకాశం. నూతన వస్త్రాలను కొనుగోలు చేస్తారు. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేనప్పటికీ అధిక శ్రమ వలన కీళ్ల నొప్పులు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త ప్రవర్తన మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed