రికార్డు బ్రేక్‌.. సింగిల్ డేలో 80 లక్షల డోసుల పంపిణీ

by  |
Prime Minister Modi to attend G7 summit
X

న్యూఢిల్లీ: నూతన టీకా పంపిణీ విధానం అమల్లోకి వచ్చిన తొలి రోజే దేశంలో రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్ నమోదైంది. 24 గంటల్లో 80 లక్షలకుపైగా డోసుల పంపిణీ జరిగింది. ఇప్పటి వరకు ఇదే గరిష్టం. కొవిన్ వెబ్‌సైట్ వివరాల ప్రకారం, సోమవారం రాత్రి 8.30 గంటల వరకు దేశంలో 80,96,417 డోసులను పంపిణీ చేశారు. ఇప్పటి వరకు ఏప్రిల్ 2నాటి 42,65,157ల డోసుల పంపిణీ రికార్డు. కానీ, సోమవారం నాటి వ్యాక్సినేషన్ ఆ రికార్డును బ్రేక్ చేసి రోజులో కోటి టీకాల పంపిణీ సాధ్యమేనని స్పష్టమైన సంకేతాలనిచ్చింది.

18ఏళ్లు పైబడినవారికి ఉచితంగా టీకా పంపిణీ కార్యక్రమం సోమవారం నుంచి అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. రికార్డు బద్దలు చేస్తూ జరిగిన టీకా పంపిణీ సంతోషకరమని, కొవిడ్-19 పోరులో టీకా ప్రధానాస్త్రమని పీఎం నరేంద్ర మోడీ సోమవారం రాత్రి ట్వీట్ చేశారు. టీకా వేసుకున్నవారికి కంగ్రాట్స్ చెబుతూ ఫ్రంట్‌లైన్ వారియర్లకు కుదోస్ అయినట్టు పేర్కొన్నారు. వెల్ డన్ ఇండియా అంటూ ట్వీట్ చేశారు.

Next Story

Most Viewed