త్వరలో వారందరికి 180 రోజుల మెటర్నిటీ సెలవులు వచ్చేలా చేస్తాం..

by  |
mlc
X

దిశ, పటాన్‌చెరు: కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 30% వేతన పెంపు అనేది కేవలం పీఆర్టీయూ సాధించిన ఘనతని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి అన్నారు. బుధవారం పటాన్‌చెరులో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం సంగారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో 30% గౌరవ వేతనం పెంపుకు కృషి చేసినందుకు గాను ఎమ్మెల్సీ కూర రఘోత్తమ రెడ్డి‌ని, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షలు గుండు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి మదన్ గోపాల్‌లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 12 నెలల వేతన బకాయిలు వచ్చేలా కృషి చేశామన్నారు. అంగన్వాడీలకు, కేజీబీవీల సమస్యలు పరిష్కరించామన్నారు. కేజీబీవీ‌లకు ఇచ్చిన విధంగానే 180 రోజుల మెటర్నిటీ సెలవులు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వచ్చేలా కృషిచేస్తామని పేర్కొన్నారు.

కాంట్రాక్ట్ లెక్చరర్లకు ఇచినట్టే టైం స్కేల్ కూడా ఇప్పించేలా ముఖ్యమంత్రిని ఒప్పిస్తాం అని హామీ ఇచ్చారు. ఆరోగ్య భద్రత, ఉద్యోగ భద్రత కల్పించేలా కృషిచేస్తామని తెలిపారు. కారుణ్య నియామకం, ఎక్స్‌గ్రేషియా గురించి కూడా ప్రభుత్వానికి విన్నవించడం జరిగిందన్నారు. రాబోయే రెండేళ్లలో గణనీయమైన మార్పులు ఉండబోతున్నాయని చెప్పారు. డీఎస్సీ తో ఉపాధ్యాయుల నియామకాలు జరగబోతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ పత్రికా సంపాదక మండలి సభ్యులు ఆకుల మాణయ్య, సురేందర్, పటాన్‌చెరు పీఆర్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విఠల్ రెడ్డి, బండి శ్రీనివాస్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed