ప్రకటనలకు పరిమితం.. చేతలకు దూరం

by  |
ప్రకటనలకు పరిమితం.. చేతలకు దూరం
X

దిశ, జగిత్యాల: కరోనా సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కర్మ సిద్ధాంతాలను వదిలేసిందా అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. జగిత్యాల జిల్లా మల్యాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజలను పట్టిచుకోవటం లేదని కరోనా భాధితులు సొంత ఖర్చులతో ట్రీట్ మెంట్ చేయించుకోవడానికి కష్టాలు పడుతున్నారన్నారు. అనుమానితులందరికీ పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్యం అందించాల్సిన సమయంలో ప్రభుత్వం చేతులెతేసిందని ఆరోపించారు. ప్రభుత్వం క్వారంటైన్‌ ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి తయారైందన్నారు. అనుమానితులు ఎవరు వచ్చినా, కరోనా పరీక్షలు నిర్వహించిన 24 గంటల్లో ఫలితాలు వచ్చేవిధంగా చూడాలని డిమాండ్ చేశారు. ఆరంభ సంబరంగా మొదట్లో క్వారంటైన్ సదుపాయాలు కల్పించి, ఇప్పుడు ఎందుకు కల్పించటం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రకటనలకే పరిమితం అయి చేతలకు దూరంగా ఉంటోందని కామెంట్ చేశారు. స్వయంగా తానే గాంధీ ఆసుపత్రి వైద్యులకు ఫోన్ చేసి మాట్లాడితే కింగ్ కోఠి ఆస్పత్రికి వెళ్లాలని, అక్కడికి వెళితే ఖాళీ లేదన్నారని వివరించారు.

Next Story

Most Viewed