బరితెగించి వెంపర్లాడుతున్నారు -చెరుకు సుధాకర్

by  |
బరితెగించి వెంపర్లాడుతున్నారు -చెరుకు సుధాకర్
X

దిశ, తుంగతుర్తి: కరోనా ప్రభావంతో ఉపాధి కోల్పోయిన ప్రైవేట్ టీచర్లకు కరోనా భృతి కింద ప్రభుత్వం వెంటనే రూ.1000 కోట్లు మంజూరు చేయాలని వరంగల్ నల్లగొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ చెరుకు సుధాకర్ అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో ఒక ప్రైవేట్ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తయని, ఏదో ఒక రంగంలో ఉపాధి దొరుకుతదని విద్యార్థులు తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఉవ్వెత్తున పాల్గొన్న సంగతిని స్వరాష్ట్ర పాలకులు యాది మరిచినారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు కొత్తేమి కాదని, కానీ ఎమ్మెల్సీ ఎన్నికలు రాష్ట్రంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టబోతున్నాయి అని అన్నారు. అధికార పార్టీ బరితెగించి చరిత్రలో ఎన్నడులేని విధంగా పట్టభద్రుల పట్టా కాగితాల కోసం వెంపర్లాడుతున్నారన్నారు. నిరుద్యోగుల ఉపాధి, బతుకుల గురించి పట్టించుకోని ప్రభుత్వానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు లేదన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏ ఒక్కరి పోరాటం వలన రాలేదని రాష్ట్ర సాధనకు ఎందరో విద్యార్థులు బలయ్యారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పార్టీలకతీతంగా నిరుద్యోగులు, మేధావులు, ఉపాధ్యాయులు, పట్టభద్రులందరు జరగబోయే నల్లగొండ, వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికలలో అండగా నిలబడితే, మీ తరుపున ప్రశ్నించే గొంతుకగా కోట్లాడుతానని అన్నారు. ఈ కార్యక్రమంలో యారాల నరసింహా రెడ్డి, విప్లవ్ కుమార్, ప్రశాంత్, శేఖర్, శ్రీనివాస్, సందీప్, దుస్సా రామూర్తి, శ్రీకాంత్ గౌడ్, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed