రాజాసింగ్‌కు ఎమ్మెల్యే శిల్పాచక్రపాణి సవాల్

by  |
రాజాసింగ్‌కు ఎమ్మెల్యే శిల్పాచక్రపాణి సవాల్
X

దిశ,వెబ్‌డెస్క్: శ్రీశైలం ఉద్యోగుల బదిలీలపై ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి స్పందించారు. తప్పు చేసిన వారి పైన కచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే అని ఆయన అన్నారు. అయితే వారు తప్పు చేశారా లేదా అన్న అంశంపై నిజ నిర్దారణ కమిటీ వేయాలని తెలిపారు. ఆలయ అభివృద్ది కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కాగా రాజీనామా సవాల్‌పై వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. రాజాసింగ్‌తో సవాల్‌కు సిద్దంగా ఉన్నానని వెల్లడించారు. పీఠాధిపతులతో నిజ నిర్దారణ కమిటీ వేసి తప్పెవరిదో తేల్చుకుందామని అన్నారు. తప్పు ఎవరిదో తేల్చుకుందాం శ్రీ‌శైలం రండి అని సవాల్ విసిరారు. గోశాలలో ఆవులు మృతి చెందలేదని, అనవసర ఆరోపణలు మంచిది కాదని అన్నారు.

Next Story

Most Viewed