‘సీఎం గారు.. వాళ్లు ఇంటికెళ్లాలి కదా’

35

దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌ నుంచి గజ్వేల్‌ ఫామ్ హౌస్‌కు రాకపోకలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం రాకపోకలు నిలిపివేసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్‌ తన రాకపోకల కారణంగా హైదరాబాద్‌ వాసులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.

దయచేసి మీ 300 ఎకరాల ఫామ్ హౌస్ నుంచి సీఎం క్యాంప్ ఆఫీస్‌కు రాకపోకలు సాగించకండి అంటూ కోరారు. ప్రస్తుతం నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని.. భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోందన్నారు. ఇటువంటి సమయంలో మీ రాకపోకల సందర్భంగా వాహనాలు మరింత నిలిచిపోవడంతో వాహన దారులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. వాళ్లు కూడా ఇంటికి జాగ్రత్తగా వెళ్లాలి.. ఆలోచించండి అంటూ సీతక్క చురకలు వేశారు.