బండి సంజయ్ తాత దిగి వచ్చినా…

by  |
బండి సంజయ్ తాత దిగి వచ్చినా…
X

దిశ, కంటోన్మెంట్: కంటోన్మెంట్‌పై అవగాహన లేకుండా బీజేపీ అగ్రనాయకులు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. కంటోన్మెంట్‌లో బీజేపీ నిర్వహించిన సభలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే సాయన్న, మార్కెట్ ఛైర్మన్ శ్రీనివాస్‌లు వేర్వేరు సమావేశాల్లో కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా సాయన్న మాట్లాడుతూ… అనవసరంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లపై నోరు పారేసుకుంటే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఆర్మీ సర్వీసెస్ ఛార్జెస్ విషయంలో స్థానిక బీజేపీ నాయకులు దృష్టి పెట్టాలని, కేంద్రం వాటి బకాయిలు తీసుకొస్తే తాము కూడా సంతోషిస్తామని అన్నారు. అంతేగాకుండా ఇటీవల టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన కంటోన్మెంట్ మాజీ ఉపాధ్యక్షుడు రామకృష్ణ, మల్లికార్జున్, మాజీ ఉపాధ్యక్షురాలు నర్మదా, మాజీ బోర్డు సభ్యురాలు అనురాధలు పార్టీని వీడినంత మాత్రాన జరిగే నష్టం ఏం లేదని, తిరిగి వారు టీఆర్ఎస్ గూటికి చేరక తప్పదని అన్నారు. కరీంనగర్‌పై పట్టు ఉన్న బండి సంజయ్‌కు కంటోన్మెంట్ గురించి సరైన అవగాహన లేదని ఆయన విమర్శించారు.

బోయిన్‌పల్లి మార్కెట్ చైర్మన్ టీ.ఎన్. శ్రీనివాస్ మాట్లాడుతూ… బీజేపీ అధ్యక్షుడు సంజయ్ తాతలు దిగి వచ్చినా కంటోన్మెంట్‌లో సాయన్నను ఓడించలేరని అన్నారు. కరోనా సమయంలో కంటోన్మెంట్‌లోని లక్షమంది పేద ప్రజలకు ఉచితంగా భోజన వసతి కల్పించి ఆదుకున్న ఘనత టీఆర్ఎస్‌కే దక్కుతుందని అన్నారు. కంటోన్మెంట్ మాజీ ఉపాధ్యక్షుడు రామకృష్ణ వరద బాధితులకు డబ్బులు పంపిణీచేసే సమయంలో కూడా మాతో ఉన్నారని, అక్రమాలకు ఎవరు పాల్పడ్డారో తెలుసని అన్నారు.

Next Story

Most Viewed