కాలినడకన ప్రకృతిని ఆస్వాదించడం మంచి అవకాశం

by  |
MLA Guvvala Balaraju
X

దిశ, అచ్చంపేట: ఎలాంటి బేధాభిప్రాయాలు లేకుండా కలిసి నడక కొనసాగించడం వలన స్త్రీ, పురుషుల మధ్య తారతమ్యాలు తొలగిపోతాయని ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండల పరిధిలో అమ్రాబాద్ రిజర్వు టైగర్ అటవీ ప్రాంతంలోని ఉమామహేశ్వర ట్రక్కింగ్‌ను సిద్దిపేట పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా గువ్వల బాలరాజు మాట్లాడుతూ.. ఆసియా ఖండంలోనే పెద్దదైన అమ్రాబాద్ టైగర్ అటవీ ప్రాంతంలో ప్రకృతిని ఆస్వాదిస్తూ కాలినడకన ట్రక్కింగ్ ఏర్పాటు చేయడం శుభ పరిణామం అన్నారు. వారి ఆత్రుత ఉత్సాహాన్ని చూస్తుంటే నాకు సైతం ఉత్సాహం కలుగుతోందని, దీనిని ఆదర్శంగా తీసుకొని అచ్చంపేట ప్రాంతాన్ని మరింత ఆదర్శంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలమూరు, అచ్చంపేట ప్రాంతాలకు చెందిన వారు పాల్గొన్నారు.



Next Story