బీజేపీ అంటేనే వ్యాపార వర్గాల పార్టీ: ఎమ్మెల్యే గండ్ర

by  |
బీజేపీ అంటేనే వ్యాపార వర్గాల పార్టీ: ఎమ్మెల్యే గండ్ర
X

దిశ భూపాలపల్లి: బీజేపీ పార్టీ అంటేనే వ్యాపార వర్గాల పార్టీ అని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. వరి ధాన్యం కొనుగోలు చేయాలని తెలంగాణ మంత్రులు చెప్పినా, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోక పోవడం పై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఆదివారం భూపాల్ పల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. రైతుల పై వ్యవసాయ నియంత్రణ చట్టం అమలు చేస్తుందనీ, విద్యుత్ ను ప్రయివేట్ పరం చేసి వ్యవసాయ మోటర్ల కు కరెంట్ బిల్లుల వసూలు చేసే ప్రయత్నం చేస్తుందనీ ఆరోపించారు. గ్యాస్ సిలిండర్ ధరను 1150 కి పెంచి సబ్సిడీని సంబంధిత బ్యాంక్ అకౌంట్లలో వేస్తామని చెప్పి వేయడం మర్చిపోయిందాన్నారు.

జర్నలిజం ముసుగులో రాజకీయాలు చేస్తున్న మిస్టర్ చింతపండు నవీన్ ఖబడ్దార్

రాష్ట్ర ప్రజల కోసం అహర్నిశలు పనిచేస్తున్న ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడం మంచి పద్ధతి కాదనీ హెచ్చరించారు. కేసీఆర్ కుటుంబమే టార్గెట్ గా చేసుకుని యూట్యూబ్ లో కథనాలు నడిపిస్తూ కనీసం వారి పదవికి కూడా మర్యాద ఇవ్వని మాట్లాడడం సరికాదన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రం లోని 100 పడకల ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో వైద్య సిబ్బంది, 204 మంది నియామకానికి GO విడుదల చేయడం జరిగిందన్నారు. త్వరగా నియామకాలను పూర్తి చేసి అన్ని హంగులతో ప్రారంభం చేసుకోబోతున్నాం అని అన్నారు. 56 కోట్ల రూపాయల తో జిల్లా ఆసుపత్రి నిర్మాణం కి టెండర్ ప్రక్రియ పూర్తి చేశామన్నారు.

ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి సెగ్గెం వెంకట రాణి సిద్దూ, వైస్ చైర్మన్ హరిబాబు, మండల పార్టీ ప్రెసిడెంట్ తిరుపతి రావు, జడ్పీటీసీ జోరుక సదయ్య, టౌన్ పార్టీ ప్రెసిడెంట్ జనార్దన్ వైస్ ప్రెసిడెంట్ బుర్ర సదానందం , మహిళ అధ్యక్షురాలు మేకల రజిత, యూత్ ప్రెసిడెంట్ రాజు, ప్రధాన కార్యదర్శి తాటి అశోక్, మైనారిటీ అధ్యక్షుడు ఖరీమ్, కౌన్సిలర్ లు అనిల్, బద్దీ సమ్మయ్య, నూనె రాజు, నారాయణ, మురళి, రవీందర్, కో ఆప్షన్ సభ్యులు వజ్రమని, జిల్లా నాయకులు సాంబమూర్తి, సాగర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, తిరుపతి, బీబీ చారి, గండ్ర యువసేన నాయకులు శ్రీకాంత్, రఘు రెడ్డి తిరుపతి, రఘోతం రెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Next Story