వర్షంలో తడుస్తూ..సైకిల్‌పై టీడీపీ ఎమ్మెల్యే పర్యటన

by  |
వర్షంలో తడుస్తూ..సైకిల్‌పై టీడీపీ ఎమ్మెల్యే పర్యటన
X

దిశ, ఏపీ బ్యూరో: కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. ఏపీలో అధికారికంగా 18,96,818కి కరోనా సోకగా 12,779మందిని మహమ్మారి బలి తీసుకుంది. కొవిడ్‌ దెబ్బతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరైతే ఉద్యోగం ఉపాధి కోల్పోయి నానా పాట్లు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా బాధితులను ఆదుకోవాలంటూ టీడీపీకి చెందిన పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కొవిడ్ బాధితులను ఆదుకోవాలంటూ 45 రోజులుగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.

తెల్ల రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం తక్షణమే రూ.10వేలు ఇవ్వాలని.. కరోనాతో మృతి చెందిన కుటుంబాలను ఆదుకునేందుకు రూ.10 లక్షలు పరిహారంగా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇకపోతే 44వ రోజైన శుక్రవారం జోరు వానలో కూడా ఆయన పర్యటించారు. యలమంచిలి మండలం శిరగాలపల్లి గ్రామంలో ఎమ్మెల్యే విస్తృతంగా పర్యటించారు. కొవిడ్ పేషంట్స్‌ను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పి ఉచితంగా నిత్యావసరాలు, పౌష్టికాహారం అందించారు. జోరు వాన కురుస్తున్నా పట్టించుకోకుండా సైకిల్‌కు ప్లకార్డు తగిలించుకుని ఓ చేత్తో గొడుకుపట్టుకుని సైకిల్ తొక్కుతూ పర్యటన కొనసాగించారు. మెుత్తానికి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు చేస్తున్న పర్యటనకు ప్రజల్లో విశేష స్పందన వస్తోంది.



Next Story

Most Viewed