టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే గ్రామాల అభివృద్ధి- చల్లా ధర్మారెడ్డి

54

దిశ, కమలాపూర్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయాంలోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని పరకాల శాసన సభ్యులు చల్లా ధర్మారెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని గూడూరు గ్రామంలో శుక్రవారం యాభై లక్షల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం అదే గ్రామంలోని మహిళా సంఘాలకు 49 లక్షల రూపాయల శ్రీనిధి వడ్డీలేని రుణాల చెక్కులను గ్రూపు సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు రుణ విమోచన కమిటీ చైర్మన్ వెంకటేశ్వరరావు, మండల ఇన్చార్జి పెరియాల రవీందర్రావు, ప్రజా ప్రతినిధులు, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..