నకిలీ విత్తనాల కలకలం

by  |
నకిలీ విత్తనాల కలకలం
X

దిశ, చింతకాని: మండలంలోని చిన్న మండవ గ్రామంలో ఒక రైతు తాను వేసిన మొక్కజొన్న పంట మూలంగా నష్టం జరగడంతో నకిలీ విత్తనాల అమ్మకం బయటపడింది. రైతు ఇచ్చిన సమాచారం ప్రకారం భారతి -54 సీడ్స్ పేరు గల మొక్కజొన్న విత్తనాలను తనకు ఉన్నటువంటి 2.5 ఎకరాల పొలంలో సాగు చేయడం జరిగింది. పంట శాతం సగానికంటే తక్కువగా రావడంతో ఆ రైతు విత్తనాలు కొనుగోలు చేసిన షాపు వ్యక్తులకు ఫోన్ చేసి పంట వేసిన పొలానికి రమ్మని చెప్పగా.. వారు వచ్చి గ్రామ పెద్దల సమక్షంలో పంటను చూశారు. రైతు దేని వలన ఇలా జరిగింది అని ప్రశ్నించగా.. భూమి లోపం వలనే ఇలా జరిగిందని సమాధానం ఇచ్చారు.

అసలు భూమి లోపమా? లేదా విత్తనాల లోపమా? ఇదే కంపెనీ విత్తనాలను కొణిజర్ల చింతకాని ముదిగొండ పలు మండలాలకు అమ్మకాలు జరిపామని వారు చెప్పారు. ఎక్కడా ఇలాంటి సమస్య ఎదుర్కొలేదని అనుమానంగా చెప్తూనే.. రైతుకు నష్ట పరిహారంకు ఒప్పుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై దిశ రిపోర్టర్ వెళ్లి రైతుకు నష్ట పరిహారం ఎందుకు చెల్లిస్తున్నారని అడగ్గా.. వారి పేరు కూడా చెప్పకపోవడం గమనార్హం. ఈ సమస్యపై సంబంధిత అధికారులు స్పందించి నిజానిజాలు తెలపాలని రైతులు కోరుతున్నారు.

Next Story

Most Viewed