చిరుతపులి చేతికి చిక్కిన చిన్న కోతి.. చిత్రాన్ని చూసి కంటతడి పెడుతున్న నెటిజన్లు..

by Sumithra |
చిరుతపులి చేతికి చిక్కిన చిన్న కోతి.. చిత్రాన్ని చూసి కంటతడి పెడుతున్న నెటిజన్లు..
X

దిశ, ఫీచర్స్ : అడవిలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. అడవిలో జరిగే వేటలో ఎవరి పై ఎవరు గెలుస్తారో చెప్పడం చాలా కష్టం. ఇక్కడ ప్రతిరోజూ ప్రతి ఒక్క జీవి తమ ప్రాణాలను కాపాడుకోవడానికి కష్టపడాల్సి వస్తుంటుంది. కొన్ని జంతువులు త్వరగా తమను తాము రక్షించుకుంటాయి. కొన్ని జంతువులు వేటగాళ్ల ఉచ్చుకు చిక్కుకుంటాయి. మరికొన్ని చిన్న ప్రాణులు పెద్ద జీవుల వేటకు బలవుతాయి. ప్రస్తుతం ఇలాంటి ఒక చిత్రమే తెగ వైరల్ అవుతుంది. ఆ చిత్రాని చూసిన వారంతా పాపం అని కంటతడి పెట్టుకుంటున్నారు. ఇంతకీ ఆ ఫోటోలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం..

చిరుతపులి అద్భుతమైన వేటగాడు అని మనందరికీ తెలుసు. చాలా జంతువులు చిరుత పులి వేట నుంచి తప్పించుకోలేవు. అది చాలా తెలివిగా తన ఎర పై హఠాత్తుగా దాడి చేస్తుంది. భూమి పైనే కాదు నీళ్లలో పరిగెడుతూ, చెట్టు ఎక్కుతూ కూడా వేటాడుతుంది. చెట్లు దిగినంత వేగంగా ఎక్కగల పెద్ద పిల్లుల కుటుంబానికి చెందినదే ఈ చిరుత. ఈ క్రమంలోనే ఓ చిరుతపులి ఓ బుజ్జి కోతిని తన వేటగా మార్చుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

వైరల్ అవుతున్న ఈ చిత్రంలో ఒక కోతి తన ప్రాణాలను కాపాడుకోవడానికి చెట్టు ఎక్కినట్లు మీరు చూడవచ్చు. అయితే ఆ బుజ్జి కోతిని ఓ చిరుత పులి వేటాడినట్టు ఫోటోలో కనిపిస్తుంది. అంతే కాదు ఆ కోతిపిల్ల ముఖం భయాందోళలో ఉన్నట్టు కనిపిస్తుంది. దీంతో నెటిజన్లు పాపం బుజ్జి కోతి అంటూ బాధపడుతున్నారు.

ఈ చిత్రాన్ని సాకేత్ బడోలా (@Saket_Badola) అనే ఖతాదారుడు నెట్టింట భాగస్వామ్యం చేశారు. ఇది చూసి జనాల మైండ్ పూర్తిగా పిచ్చెక్కిపోయి రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఓ ఖాతాదారుడు అడవి నుండి అటువంటి చిత్రాలు వచ్చినప్పుడల్లా, చూడటానికి చాలా బాధగా ఉందని రాశాడు. 'ప్రకృతి నిజంగా ఇంత క్రూరంగా ఉందా?' ఇది భౌతిక ప్రపంచం వాస్తవికత అని మరొకరు రాశారు.

Next Story

Most Viewed