పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్ అంజలి.. క్లారిటీ ఇస్తూ ఆసక్తికర కామెంట్స్!

by Hamsa |
పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్ అంజలి.. క్లారిటీ ఇస్తూ ఆసక్తికర కామెంట్స్!
X

దిశ, సినిమా: హీరోయిన్ అంజలి అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు అంజలి మూవీతో తమిళ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత తెలుగులో ‘ఫొటో’ సినిమా చేసింది. కానీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు, బలుపు, గీతాంజలి వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. అలాగే ‘సర్రైనోడు’ సినిమాలోని ఐటెం సాంగ్‌లో అల్లు అర్జున్ సరసన ఆడిపాడి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం అంజలి గేమ్ ఛేంజర్, గ్యాంగ్ గోదావరిలో కీలక పాత్రలో కనిపించనుంది. ఈ క్రమంలో అంజలి పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయిపోయిందనే పుకార్లు జోరందుకున్నాయి.

తాజాగా, గ్యాంగ్ ఆఫ్ గోదావరి ప్రమోషన్స్‌లో పాల్గొన్న అంజలి పెళ్లి వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చింది. ‘‘ఇప్పటికీ నా పెళ్లి వార్తలు వస్తూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో నాకు మూడు నాలుగు సార్లు పెళ్లిళ్లు అయినట్లు రూమర్స్ వచ్చాయి. ఒకప్పుడు అవి చూసి నా ఫ్యామిలీ వాళ్ళు కంగారు పడేవాళ్ళు. కానీ ఇప్పుడు వాటిని పట్టించుకోవడం లేదు. ఈ మధ్య ఓ వ్యాపారవేత్తతో నా పెళ్లి జరిగినట్లు పుకారు వచ్చింది. దీంతో ఈ విషయం మా అక్కకి తెలిసి ఫోన్ చేసి మరీ పెళ్లి చేసుకున్నావటగా అని అడిగింది. నేను ఏమో మరి నాకు తెలియదు అని చెప్పాను. ఈ రూమర్స్ వల్ల పరిస్థితి ఎలా అయిందంటే.. నేను ఓ అబ్బాయిని ఇంటికి తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటా అన్నా ఇంట్లో వాళ్లు నమ్మేలా లేదు.

ప్రస్తుతం సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాను. ఇక పెళ్లి అంటారా.. కచ్చితంగా చేసుకుంటా. కానీ ఇప్పుడు కాదు. ఎందుకంటే పెళ్లి అయితే సినిమాలు చేయాలి, పర్సనల్ లైఫ్ లీడ్ చేయాల్సి వస్తుంది. రెండు బ్యాలెన్స్ చేయకుంటే ప్రాబ్లం కదా అందుకే కొంచెం టైమ్ తీసుకుని చేసుకోవాలని అనుకుంటున్నాను. అలా అని పెళ్లి తర్వాత సినిమాలు చేయకుండా ఉంటాను అనుకోకండి. పెళ్లై పిల్లలు పుట్టిన మూవీస్ చేయడం ఆపను’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అంజలి కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతుండటంతో ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Next Story

Most Viewed