The Sleep Contest : ఒక్క చోట చేరి నిద్రపోతున్న సౌత్ కొరియన్లు.. ప్రపంచానికి ఇస్తున్న మెసేజ్ ఇదే..

by sudharani |
The Sleep Contest : ఒక్క చోట చేరి నిద్రపోతున్న సౌత్ కొరియన్లు.. ప్రపంచానికి ఇస్తున్న మెసేజ్ ఇదే..
X

దిశ, ఫీచర్స్ : వందల మంది సౌత్ కొరియన్లు ప్రపంచానికి బెస్ట్ మెసేజ్ ఇచ్చేందుకు కలిసి వచ్చారు. ఆ దేశ రాజధాని సియోల్ లోని హన్ రివర్ పార్క్ లో స్లీపింగ్ కాంటెస్ట్ లో పాల్గొన్నారు. గంటన్నర పాటు జరిగిన ఈ ఈవెంట్ కు హాజరయ్యేందుకు రాత్రి పడుకునే ముందు వేసుకున్న దుస్తులను ధరించి.. కంఫర్ట్ గా నిద్రపోయేందుకు ప్రయత్నించారు. రెస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అనే విషయంపై అవగాహన కల్పించారు.

బిజీ లైఫ్ నుంచి బ్రేక్స్, రెస్ట్ అవసరమని చెప్పడమే ఈ స్లీపింగ్ కాంటెస్ట్ ఉద్దేశ్యం కాగా ఇందులో పార్టిసిపేట్ చేసిన వారిని చక్కిలిగింతలు పెట్టడం, ఈకలతో టచ్ చేయడం, దోమల శబ్దాలు ప్రయోగించడం ద్వారా డిస్టర్బ్ చేస్తారు. ఇక ప్రతి పార్టిసిపెంట్ హార్ట్ రేట్ ముందుగానే మెజర్ చేసిన నిర్వాహకులు.. పడుకునేటప్పుడు కూడా చెక్ చేశారు. వీటి మధ్య ఎక్కువ వ్యత్యాసం బెస్ట్ స్లీప్ క్వాలిటీ కలిగి ఉండటాన్ని సూచిస్తుంది కాబట్టి ఈ డిఫరెన్స్ ఎక్కువ ఉన్న వారినే విజేతలుగా ప్రకటిస్తారు.

సౌత్ కొరియా కాంపిటీటివ్ సొసైటీని కలిగి ఉండగా.. ఆ దేశంలో నిద్రలేమి మేజర్ ప్రాబ్లమ్ అయిపోయింది. అక్కడి జనాలు కనీసం ఏడు గంటలు కూడా నిద్ర పోవడం లేదని రిపోర్ట్స్ వెల్లడించాయి. ఇక ఇండియా విషయానికి వస్తే 2023 సర్వే ప్రకారం 55శాతం మంది ఆరు గంటల కంటే తక్కువగా నిద్రిస్తున్నారని తేలింది. మరో సర్వేలో 88శాతం మంది సంపూర్ణంగా నిద్రపోకుండా.. మధ్య మధ్యలో లేస్తున్నారని, 25శాతం మంది నిద్ర రుగ్మతలు కలిగి ఉన్నారని తేలింది.

Next Story

Most Viewed