మగతోడు లేకుండా జన్మనిచ్చిన ఫిమేల్ షార్క్ ?

by  |
fish
X

దిశ, ఫీచర్స్ : ఇటలీలోని సార్దీనియాలో ఒక అద్భుతం చోటుచేసుకుంది. పదేళ్లుగా రెండు ఫిమేల్ షార్క్స్ వాటర్ ట్యాంకులో ఉంటుండగా.. అందులో ఒకటి తాజాగా బేబీ షార్క్‌కు జన్మనిచ్చింది. ఇందులో వింతేముంది అనుకుంటున్నారా? కచ్చితంగా ఉంది. ఎందుకంటే దశాబ్ద కాలం నుంచి ఆ ట్యాంకులో ఒక్క మేల్ షార్క్ కూడా లేకపోవడం విశేషం. సాధారణంగా పునరుత్పత్తి జరగాలంటే మేల్, ఫిమేల్ మేటింగ్ జరగాలి. కానీ ఎటువంటి లైంగిక ప్రక్రియ జరగకుండానే పునరుత్పత్తి జరగడం నిపుణులకు సైతం ఆశ్చర్యం కల్గిస్తోంది. ప్రస్తుత ఘటనతో ఈ జాతిలో అలైంగిక పునరుత్పత్తికి సంబంధించి నమోదైన మొదటి కేసు ఇదే అని నిపుణులు భావిస్తున్నారు.

కామన్ స్మూత్-హౌండ్ జాతికి చెందిన రెండు ఆడ సొరచేపలు.. దశాబ్ద కాలంగా ఇటలీ సార్డినియాలోని అక్వేరియా కాలా గోనోన్‌లో ఉంటున్నాయి. తాజాగా అందులోని ఫిమేల్ షార్క్, బేబీ షార్క్‌కు జన్మించింది. ఈ బుల్లి షార్క్ కు అక్వేరియం సిబ్బంది ఇస్పెరా అని పేరు పెట్టారు. మేల్ షార్క్ లేకుండా జన్మనివ్వడంతో పార్థినోజెనిసిస్ పునరుత్పత్తి- అలైంగిక పునరుత్పత్తి( దీనిలో ఒక గుడ్డు స్పెర్మ్ ద్వారా ఫలదీకరణం చెందకుండా పిండంగా అభివృద్ధి చెందుతుంది) ద్వారా ఇలా జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే 10ఏళ్లకు పైగా ఏ మేల్ షార్క్ లేని సదరు ట్యాంక్‌లో ఉంటున్న ఫిమేల్ షార్క్‌.. బేబీ షార్క్‌కు జన్మనివ్వడం కొత్త శాస్త్రీయ పజిల్‌ను విసిరింది.

కాగా ఈ బేబీ షార్క్ తన తల్లికి క్లోన్‌గా నిపుణులు భావిస్తున్నారు. వారి అంచనాలను నిర్దారించుకునేందుకు ట్యాంకులోని రెండు ఫిమేల్ షార్క్‌ల డీఎన్ఏ శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించారు. పిండం ఒక జీవి నుంచి మాత్రమే జన్యు పదార్థాన్ని స్వీకరిస్తుంది కాబట్టి పార్థినోజెనిసిస్ పుట్టుక అనేది పేరెంట్ క్లోనింగ్ అవుతుంది. ఈ రకమైన పునరుత్పత్తి దాదాపు అపరిపక్వ స్పెర్మ్ లాగా ప్రవర్తించే గుడ్డు కణంతో పిండం ఫలదీకరణం చెందడం వల్ల జరుగుతుంది. పురుగులు, కీటకాలు, కొన్ని అరాక్నిడ్లు, క్రస్టేసియన్లు వంటి అకశేరుకాలలో పార్థినోజెనిసిస్ సాధారణం. కొన్ని ఉభయచరాలు, బల్లులు, చేపలతో సహా సకశేరుకాలలో ఇది చాలా అరుదుగా కనిపిస్తుంది. స్వీయ క్లోనింగ్ జననాలు గతంలో ‘బోనెట్‌హెడ్, బ్లాక్‌టిప్ షార్క్, జీబ్రా షార్క్’ వంటి మూడు సొరచేప జాతుల్లో కనుగొన్నారు. పార్థినోజెనిసిస్ ఫలితంగా ఇస్పెరా జన్మించినట్లయితే, మృదువైన-హౌండ్ ఈ జాబితాలో చేర్చబడిన నాల్గవ సొరచేప జాతి అవుతుంది.

Next Story

Most Viewed