ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన మీరాబాయ్ చాను

by  |
olympics meera chanu
X

దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ చాను (49 కేజీల కేటగిరి) టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించినట్లు ఇంటర్నేషనల్ వెయిట్‌ లిఫ్టింగ్ ఫెడరేషన్ (ఐడబ్ల్యూఎఫ్) శనివారం ప్రకటించింది. 2017 వరల్డ్ చాంపియన్ అయిన మీరాబాయి.. ఏప్రిల్‌లో తాష్కెంట్‌లో నిర్వహించిన ఆసియన్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం గెలుచుకున్నది. అంతే కాకుండా క్లీన్ అండ్ జర్క్‌లో ప్రపంచ రికార్డు కూడా సాధించింది.

ఐడబ్ల్యూఎఫ్ తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్ లిస్టులో మీరాబాయి 2వ స్థానంలో నిలిచింది. ‘మీరాబాయ్ టోక్యో ఒలింపిక్స్ 2020కి అర్హత సాధించినందకు శుభాకాంక్షలు. ఐడబ్ల్యూఎఫ్ ర్యాకింగ్స్‌లో ఆమె 2వ స్థానంలోనిలిచింది’ అని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ట్వీట్ చేసింది. ఆసియా చాంపియన్‌షిప్స్‌కు ముందు మీరాబాయి 4వ ర్యాంకులో ఉన్నది. అయితే ఆ పోటీల నుంచి ఉత్తర కొరియా తప్పుకోవడంతో మీరాబాయి 2వ ర్యాంకుకు చేరుకున్నది. కాగా, వెయిట్ లిఫ్టింగ్‌లో అర్హత సాధించిన వారి పూర్తి జాబితాను ఈ నెల 25 ప్రకటిస్తారు.


Next Story

Most Viewed