ఆన్ లైన్ క్లాసులు: ఇంటర్ విద్యార్ధినిపై జీవితాంతం మర్చిపోలేని దారుణం!

by  |
ఆన్ లైన్ క్లాసులు: ఇంటర్ విద్యార్ధినిపై జీవితాంతం మర్చిపోలేని దారుణం!
X

దిశ,వెబ్‌డెస్క్:ఆన్‌లైన్ క్లాసులు పిల్లల జీవితాల్ని నాశనం చేస్తున్నాయి. అభంశుభం తెలియని వయస్సులో స్నేహం పేరుతో అపరిచిత వ్యక్తులు పరిచయం అవుతున్నారు. ఆ పరిచయంతో ఫ్రెండ్ అంటారు.ఫేస్‌బుక్‌లో చాటింగ్ అంటారు. చివరికి జీవితాంతం మర్చిపోలేని దారుణానికి ఒడిగడుతున్నారు. తాజాగా ఆన్ లైన్ క్లాసుల పేరుతో ఇంటర్ విద్యార్ధినిపై జరిగిన దారుణం తెలుగు రాష్ట్రాల తల్లిదండ్రుల్ని ఆందోళనకు గురిచేస్తుంది.

ఆన్ లైన్ క్లాసులు జరుగుతున్నాయని మీ పిల్లలకు ఫోన్లిచ్చి మీరు టీవీతో కాలక్షేపం చేస్తున్నారా..? లేదంటే ఆఫీస్‌వర్క్ ‌లో మునిగితేలుతున్నారా..?అయితే తస్మాత్‌జాగ్రత్త .స్నేహం పేరుతో మృగాళ్లు రెచ్చిపోతున్నారు.

మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్ధినికి.., ఆంధ్రప్రదేశ్ జంగారెడ్డి గూడెం పట్టణానికి చెందిన సింహాద్రి ఫేస్‌బుక్ లో పరిచయం అయ్యాడు. ఆన్ లైన్ క్లాసుల పేరుతో విద్యార్ధిని తో పరిచయం పెంచుకున్నాడు. పరిచయం కాస్త ప్రేమగా మారి.., ఆన్ లైన్ లో గంటల తరబడి చాటింగ్ చేసే దాకా వెళ్లింది. అదే సమయంలో నిన్ను చూడాలి. నీతో మాట్లాడాలి. వెంటనే నేను చెప్పిన చోటుకు వచ్చేయ్ అంటూ విద్యార్ధినిని నమ్మించాడు. అయినా సరే నేను రానంటూ కరాఖండీగా చెప్పేసింది. దీంతో చేసేది లేక ప్రేమ పేరుతో కొత్తనాటకానికి తెరదించాడు. అది నిజమని నమ్మిన విద్యార్ధిని నిందితుడు చెప్పిన చోటుకి బస్సుల్లో వెళ్లింది.

ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం తనకోసం బస్సులో వచ్చిన విద్యార్ధినిని బైక్‌పై ఎక్కించుకొని ఉదయం నుంచి సాయంత్రం దాకా తిప్పాడు. అప్పటికే భయాందోళనకు గురైన బాధితురాలు.., లేట్ అవుతుంది. నేను ఇంటికి వెళ్లాలి. నాకోసం అమ్మా,నాన్న ఎదురు చూస్తుంటారని చెప్పింది. అప్పుడే సింహాద్రి లేదు లేదు. ఈ ఒక్కరోజు నాతో ఉండాల్సిందేనని పట్టుబట్టాడు. ఓ వైపు అమ్మనాన్నకి ఫోన్ చేయాలంటే భయం. ఇంటికి వెళ్లాలంటే చికటి. దీంతో ఏం చేయాలో పాలుపోని బాధితురాలు.ఆ రాత్రి సింహాద్రితో ఉండేందుకు ఒప్పుకుంది.

పథకంలో భాగంగా మైనర్లకు లాడ్జీలో రూమ్‌లు ఇవ్వరని తెలుసుకున్నాడు నిందితుడు. అందుకే అశ్వారాపేటలో ఓ లాడ్జి ఓనర్ కొడుకు, నిందితుడి స్నేహితుడు మురారీ సాయంతో సదరు లాడ్జికి తీసుకెళ్లాడు. 3 రోజుల పాటు లాడ్జిలోనే దారుణానికి ఒడిగట్టాడు. ఫ్రెండ్స్‌ అంటూ మరో ఇద్దరిని పరిచయం చేశాడు. ఆ ఇద్దరు నిందితులు బాధితురాలి జీవితాన్ని నాశనం చేశారు. తనను ఇంటికి పంపించాలని ప్రాధేయపడినా పట్టించుకోకుండా చిత్రహింసలకు గురి చేశారు. ఎదురు తిరిగితే చంపేస్తామని బెదిరించారు.

అప్పటికే బాలిక తల్లిదండ్రులు తొర్రూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాధితురాలి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అదే సమయంలో నాలుగోరోజు నిందితుల చెర నుంచి తప్పించుకున్న బాధితురాలు తల్లిదండ్రులకు ఫోన్ చేసి దారుణం గురించి చెప్పింది. దీంతో నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మురారిపై పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. బాధితురాలిని వరంగల్‌లోని సంరక్షణ కేంద్రానికి తరలించారు.

Next Story

Most Viewed