అభివృద్ధి పనులను నాణ్యతతో చేపట్టాలి : మంత్రి నిరంజన్ రెడ్డి

by  |
అభివృద్ధి పనులను నాణ్యతతో చేపట్టాలి : మంత్రి నిరంజన్ రెడ్డి
X

దిశ,వనపర్తి : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికి సురక్షిత మంచినీటిని అందించే మిషన్ భగీరథ పథకం లో భాగంగా చేపడుతున్న పైప్లైన్ పనులను మన్నిక తో చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ గట్టు యాదవ్, మిషన్ భగీరథ అధికారులకు సూచించారు.

శనివారం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల నుంచి పీర్ల గుట్ట వాటర్ ట్యాంక్ వరకు పూర్తయిన మిషన్ భగీరథ పనులను ఆయన పరిశీలించారు. మిషన్ భగీరథ నీటి సరఫరా పైప్ లైన్ పనులు ఎటువంటి లికేజీ లేకుండా చూడాలని, నిరంతరం పైప్ లైన్ లీకేజ్ ను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేయాలని అన్నారు. పైప్ లైన్ పనులు పూర్తయిన వెంటనే సీసీ రోడ్డు పనులను నాణ్యతతో చేపట్టాలని మంత్రి సూచించారు. పైప్ లైన్ లు పూర్తయిన వెంటనే కోటి 20 లక్షల వ్యయంతో 24 ఫీట్ల వెడల్పు లో సీ సీ రోడ్డు నిర్మిస్తామని, రోడ్డుకు ఇరువైపులా అక్రమ కట్టడాలను తొలగిచాలని మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ కు మంత్రి సూచించారు.ఈ కార్యక్రమంలో పుర కౌన్సిలర్లు, తెరాస నాయకులు, మిషన్ భగీరథ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed