నిధులు ఇవ్వక పోవడం దారుణం

by  |
నిధులు ఇవ్వక పోవడం దారుణం
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తితే జాతీయ విపత్తు నిధి నుంచి నిధులను కేంద్రం కేటాయించక పోవడం దారుణమని రాష్ట్ర పశు సంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోషామహల్ నియోజకవర్గం మంగళ్ హాట్ డివిజన్ లో నిద్రిస్తున్న బాలికపై గోడ కూలి మృతి చెందింది. ఈ ఘటనలో బాధిత కుటుంబానికి రూ 5 లక్షల చెక్కును ఎంపీ అసదుద్ధిన్ ఓవైసీతో కలిసి మంత్రి తలసాని మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…. రాష్ట్రంలో వర్షాల కారణంగా పెద్ద విపత్తు ఏర్పడితే కేంద్రం నిధులు ఇవ్వక పోవడం పై ఆయన మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారనీ, ప్రకృతి వైపరిత్యాలతో రాష్ట్రాలు అల్లాడుతుంటే ప్రధానిగా ఉండి కూడా మోడీ పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో బీజేపీ నాయకులు పెద్ద పోటుగాండ్ల లెక్క మట్లాడతారని అన్నారు. వరద సహాయం కింద నిధులు తెచ్చే బాధ్యత మీకు లేదా ? అని ప్రశ్నించారు .ఇప్పటి వరకూ దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం , ఏ ముఖ్యమంత్రి కూడా వరదలు ముంచెత్తిన వెంటనే రూ 550 కోట్లు కేటాయించలేదన్నారు. అంతేకాకుండా ఒక రోజు ముందు నిధులు కేటాయించి మరుసటి రోజే ప్రజలకు ఇవ్వడం దేశ చరిత్రలోనే మొదటి సారన్నారు. రాజాసింగ్ కు వ్యతిరేకంగా నినాదాలు…

మంగళ్ హాట్ కు మంత్రి తలసాని రాకముందే ఎమ్మెల్యే టీ. రాజాసింగ్ వచ్చి వెళ్లారు. ఐతే అప్పటికే అక్కడ ఎంఐఎం నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. రాజాసింగ్ ను చూసిన వారు వెంటనే రాజాసింగ్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. గోడ కూలి మూడు రోజులు గడిచినా పరామర్శించేందుకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. దీంతో పోలీసులు అప్రమత్తమై ఆయనను అక్కడి నుండి పంపించి వేశారు.


Next Story

Most Viewed