విశాఖ-భోగాపురం మధ్య కోస్టల్ హైవే: శంకర్ నారాయణ

80

దిశ,వెబ్ డెస్క్: విశాఖ-భోగాపురం మధ్య 6 లైన్ల కోస్టల్ హైవే నిర్మాణం చేపట్టనున్నట్టు మంత్రి శంకర్ నారాయణ తెలిపారు. గోస్తనీ నదిపై 2.6 కిలోమీటర్ల పొడవైన బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నట్టు చెప్పారు. ఐకానిక్ డిజైన్ చేయాలని సీఎం జగన్ సూచించారని వెల్లడించారు. రహదారుల అభివృద్ది కోసం ఏపీని 4 డివిజన్లుగా విభజించామని చెప్పారు. మార్చి 31 నాటికి దెబ్బతిన్న రోడ్ల పునర్నిర్మాణం చేస్తామన్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..