వినాయక చవితి శుభాకాంక్షలు : మంత్రి

by  |

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: రాష్ట్ర ప్రజలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఇంటా వినాయక చవితి సందర్భంగా ప్రతిష్టించే గణనాథులకు భక్తి శ్రద్ధలతో పూజలు చేసి, కరోనా మహమ్మారి నుంచి అందరినీ కాపాడాలని వేడుకుందామన్నారు. అందరికీ మంచి జరగాలని, సమస్యలు తొలిగిపోవాలని, అందరికీ గణనాథుని ఆశీసులతో శుభాలు, విజయాలు చేకూరాలని ప్రార్థించాలని కోరారు.

మట్టి వినాయకులను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. తెలంగాణ రాష్టాన్ని కరోనా నుంచి విముక్తి చేయాలని అందరూ వినాయకున్ని ప్రార్థించాలని తెలిపారు. దేవగణాలకు అధిపతి అయిన ఏకదంతుని చవితి పండగను ఆనందకరమైన వాతావరణంలో కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవాలని, విగ్నేశ్వరుని ఆశీసులతో అందరూ చల్లగా ఉండాలని, మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

Telugu News , Latest Telugu News. Telangana News. Political News. Cinema News. Crime News. AP News. Web Stories. Latest Photo Galleries

Next Story

Most Viewed