‘నా జిల్లాలో బండి సంజయ్ ఆటలు సాగవు’

68

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ… నాలుగు ఓట్లు.. నాలుగు సీట్ల కోసం వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని మండిపడ్డాడు. తమ నియోజకవర్గంలో బీజేపీ ఆటలు సాగవు అని హెచ్చరించారు. అంతేగాకుండా బీజేపీ నేతలకు చేతనైతే తనపై ఒక్క ఆరోపణనైనా నిరూపించాలని సవాల్ విసిరారు. ‘‘దమ్ముంటే ఆరోపణలపై విచారణ చేయించు’’ అని బండి సంజయ్‌కు చాలెంజ్ చేశారు. తమ ఖమ్మం జిల్లాలో బీజేపీ భజన రాజకీయాలు చెల్లవు అని అన్నారు. రానున్న రోజుల్లో ప్రజలే బీజేపీకి తగిన బుద్ధి చెబుతారని సూచించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..