పంట నిల్వ‌కు ఇబ్బందులు క‌లిగించొద్దు : మంత్రి అజ‌య్‌

by  |
పంట నిల్వ‌కు ఇబ్బందులు క‌లిగించొద్దు : మంత్రి అజ‌య్‌
X

దిశ‌, ఖ‌మ్మం: ధాన్యం, మొక్క‌జొన్నల‌ను నిల్వ చేసేందుకు గోదాంల కొర‌త లేకుండా చూడాల‌ని మంత్రి అజ‌య్‌కుమార్ అధికారుల‌కు సూచించారు. ఖమ్మం జిల్లాలో కొనుగోలు చేసిన వరి, మొక్క‌జొన్న ధాన్యానికి సరిపడా గోదాంలపై బుధవారం టీటీడీసీ భ‌వ‌న్‌లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంబంధిత అధికారులు, ప్రజాప్ర‌తినిధుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. సమీక్షలో మార్కెటింగ్, వ్యవసాయం, రవాణా, మార్కుఫెడ్, వేర్ హౌసింగ్, సివిల్ సప్లై, సహకార శాఖ జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రైతుల నుంచి ఇప్పటివరకూ కొనుగోలు చేసిన ధాన్యం, మిగిలి ఉన్న ధాన్యం, గన్నీ బ్యాగులు నిల్వలకు గోదాములు ఏర్పాటు, రవాణా తదితర అంశాలపై అధికారులతో మాట్లాడారు. సమీక్షలో కలెక్టర్ కర్ణన్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మేయర్ పాపాలాల్, జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మెన్ కొండబాల కోటేశ్వరరావు, ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, కందాల ఉపేందర్ రెడ్డి, రాములు నాయక్, రైతు సమన్వయ సమితి చైర్మన్ నల్లమల వెంకటేశ్వర రావు, మార్క్‌ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్ తదితరులు ఉన్నారు.

tags : Puvvada Ajay, review meeting, officials,khammam, Grain, Warehouseman

Next Story

Most Viewed