కందుల కొనుగోలు పరిమితి పెంచాలని కేంద్రానికి లేఖ రాస్తాం

by  |
కందుల కొనుగోలు పరిమితి పెంచాలని కేంద్రానికి లేఖ రాస్తాం
X

దిశ, తెలంగాణ బ్యూరో: పంట కొనుగోళ్లలో కేంద్రం విధిస్తున్న పరిమితి విధానంలో మార్పు రావాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ అనుకూల విధానం మూలంగా సాగు, దిగుబడులు పెరుగుతున్నాయని, దానిని కేంద్రం పరిగణలోకి తీసుకోక పోవడం విచారకరమన్నారు. సోమవారం మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో యాసంగి పంటలు, కొనుగోళ్లు, ఎరువుల వినియోగం, భూసార పరీక్షలు, ప్రత్యామ్నాయ పంటలు, ఉత్తమ సాగు పద్దతులు తదితర అంశాలపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మద్దతు ధరకు కందిపంట కొనుగోలు పరిమితి పెంచాలని కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించామని, కేంద్రం ఐదేళ్ల సగటు సాగును పరిగణలోకి తీసుకుని దిగుబడిలో 25శాతం పంటకే మద్దతు ధర వర్తించేలా ఉత్తర్వులు ఇవ్వడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం ఈ ఏడాది తెలంగాణలో సాగయిన కంది పంట దిగుబడి పరిగణలోకి తీసుకుని ఎంఎస్‌పీపై కొనుగోలు చేయాలన్నారు. కందుల కొనుగోలుకు ముందస్తు కార్యాచరణ చేపట్టాలని, నియంత్రణ సాగులో భాగంగా సీఎం కేసీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు 10.80 లక్షల ఎకరాల్లో రైతులు కంది సాగు చేశారని మంత్రి తెలిపారు.



Next Story

Most Viewed