విరించి హాస్పిటల్ నిర్వాకంపై కేటీఆర్ సీరియస్..

by  |
విరించి హాస్పిటల్ నిర్వాకంపై కేటీఆర్ సీరియస్..
X

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో గల విరించి హాస్పిటల్ వివాదంపై ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. ఆస్పత్రిలో జరిగిన ఘటనపై విచారణ జరపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కరోనా బారిన పడిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ గురువారం మృతి చెందడంతో అతని బంధువులు ఆస్పత్రిలో గందరగోళం సృష్టించారు.

షేషెంట్ ప్రాణం పోతున్నా ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా మృతదేహాన్ని అప్పగించాలంటే రూ.20లక్షలు చెల్లించాలని డిమాండ్ చేయడంతో మృతుని తరఫు బంధులు ఆస్పత్రి సిబ్బందిపై దాడికి దిగారు. అది కాస్త తీవ్ర ఉద్రిక్తతకు దారితీయడంతో పోలీసులు జోక్యం చేసుకోవడంతో వివాదం సర్దుమణిగింది. ఇలాంటి కేసులు హైదరాబాద్‌లో రోజువారీగా వెలుగు చూస్తుండటంతో పలు ప్రైవేట్ ఆస్పత్రులకు డీహెచ్ నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే.

Next Story