ఆహ్లాదభరితంగా శ్మశాన వాటికలు..

by  |
ఆహ్లాదభరితంగా శ్మశాన వాటికలు..
X

దిశ ప్ర‌తినిధి, హైద‌రాబాద్ : శ్మ‌శాన వాటిక‌ల‌ను పూర్తి స్థాయిలో ఆధునీక‌రించడంతో పాటు బాధ‌తో వ‌చ్చే వారికి స్వాంత‌న కలిగించే స్థ‌లాలుగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీంతో గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లోని గ్రేవ్‌యార్డుల‌న్నింటినీ జీహెచ్ఎంసీ ఆధునీక‌రించింది. గ్రేటర్ ఫండ్‌తో కొన్ని శ్మ‌శాన‌వాటిక‌ల‌ను అభివృద్ది చేయ‌డం, మరికొన్నింటిని కార్పొరేట్ సోష‌ల్ రెస్పాన్స్ బులిటీ కింద ప‌లు ప్రైవేట్ సంస్థ‌ల‌తో అభివృద్ది చేయించారు. సీఎస్ఆర్ ప‌థ‌కంలో భాగంగా రాయ‌దుర్గ్‌లోని శ్మశాన‌వాటిక‌ను ఓ కార్పొరేట్ సంస్థ వైఫై, ఇంట‌ర్నెట్‌, కెఫెటేరియాతో స‌హా స‌ర్వ‌హంగుల‌తో రూపొందించింది. ఈ మహా ప్రస్థానం శ్మశానవాటిక దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందింది. ఆ ప్రాజెక్టు సూప‌ర్‌హిట్ కావ‌డంతో న‌గ‌రంలోని ఇత‌ర శ్మ‌శాన‌వాటిక‌లను జీహెచ్ఎంసీ అభివృద్ది చేసింది. వీటిలో పలు శ్మశాన వాటికల అభివృద్ది పనులు పూర్తి కాగా, మరికొన్ని పురోగతిలో ఉన్నాయి. పూర్తయిన వాటిలో బల్కంపేటలో నిర్మించిన వైకుంట ధామాన్ని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు శుక్రవారం ప్రారంభించనున్నారు.

అత్యాధునిక వ‌స‌తులు..

శ్మ‌శాన‌వాటిక‌ల్లో అత్యంత ఆధునిక‌మైన వ‌స‌తుల‌తో ప్ర‌ధానంగా ప్ర‌హ‌రీల నిర్మాణం, చితిమంట‌ల ఫ్లాట్‌ఫామ్‌ల నిర్మాణం, అస్తిక‌ల‌ను భ‌ద్ర‌ప‌రిచే సౌక‌ర్యం, ప్రార్థ‌న గ‌ది, వెయిటింగ్ ఏరియా, సెట్టింగ్ గ్యాల‌రీ, పార్కింగ్ సౌక‌ర్యం, న‌డ‌క‌దారి, ఆఫీస్ ప్లేస్‌, వాష్ ఏరియా, ఎల‌క్ట్రిఫికేష‌న్‌, హ‌రిత‌హారం, ల్యాండ్ స్కేపింగ్‌ల‌ను జీహెచ్ఎంసీ నిర్మించింది.ఈ వైకుంటదామాల అభివృద్ది పనులను ఐటీ మంత్రి కేటీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షించడం, మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌ శ్మ‌శాన‌వాటికల అభివృద్దిపై క్షేత్ర‌స్థాయి త‌నిఖీలను విస్తృతంగా చేపట్టారు. అభివృద్ది చేసిన శ్మశానవాటికల్లో బ‌ల్కంపేట, గోప‌న‌ప‌ల్లి, జెపీకాల‌నీ, తారాన‌గ‌ర్, మియాపూర్ (ముస్లీం), మూసాపేట్, గౌతమ్‌న‌గ‌ర్ (ముస్లీం), గౌత‌మ్‌న‌గ‌ర్ (హిందూ), ఎస్‌పీన‌గ‌ర్ (హిందూ), మ‌చ్చ‌బొల్లారం (హిందూ), రాంరెడ్డి న‌గ‌ర్ (ముస్లీం), పంజాగుట్ట, దేవునికుంట, దోమ‌ల్‌గూడ వినాయ‌క్‌న‌గ‌ర్, శివ‌రాంప‌ల్లి గ్రేవ్‌యార్డ్ , అంబ‌ర్‌పేట్ మోహినిచెరువు, మోక్ష‌వాటిక, మ‌ల్లాపూర్ హిందూ గ్రేవ్‌యార్డ్, జ‌మాలీకుంట, స్వ‌ర్ణ‌మార్గం, సీతాల్‌మాత, తారాన‌గ‌ర్ (హిందూ), సాయిన‌గ‌ర్ లాలాపేట, ఆర్య‌న్ గ్రేవ్‌యార్డ్, క్రిష్టియ‌న్ గ్రేవ్‌యార్డ్ లతో పాటు మరికొన్ని ఉన్నాయి.

రూ.2.96 కోట్లతో బల్కంపేట్ శ్మశానవాటిక అభివృద్ధి..

మంత్రి కేటీఆర్ ప్రారంభించే బల్కంపేట్ శ్మశానవాటికను రూ. 2.96 కోట్ల వ్యయంతో జీహెచ్ఎంసీ అభివృద్ది చేసింది. ఫతేనగర్ ఫ్లైఓవర్ సమీపంలో 2.45 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ శ్మశానవాటికను ఆహ్లాదభరితంగా, చూపరులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. వైకుంఠధామంగా వ్యవహరించే ఈ శ్మశానవాటిక ప్రవేశద్వారం ఆకర్షనీయంగా రూపొందించారు. దీనిలో చితిమంట‌ల ఫ్లాట్‌ఫామ్‌ల నిర్మాణం, అస్తిక‌ల‌ను భ‌ద్ర‌ప‌రిచే సౌక‌ర్యం, ప్రార్థ‌న గ‌ది, వెయిటింగ్ ఏరియా, సెట్టింగ్ గ్యాల‌రీ, పార్కింగ్ సౌక‌ర్యం, న‌డ‌క‌దారి, ఆఫీస్ ప్లేస్‌, వాష్ ఏరియా, ఎల‌క్ట్రిఫికేష‌న్‌, హ‌రిత‌హారం, ల్యాండ్ స్కేపింగ్‌ల‌ను ఏర్పాటు చేశారు. ఈ శ్మశానవాటికలో బివోటీ పద్ధితిన పబ్లిక్ టాయిలెట్లను కూడా నిర్మించారు.



Next Story

Most Viewed