ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్‌తో దుకాణాలు

by  |
ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్‌తో దుకాణాలు
X

దిశ సూర్యాపేట: ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్ విధానంతో నిర్మించిన వ్యాపార దుకాణ సముదాయములను మంత్రి జగదీశ్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పట్టణ పేదరిక నిర్మూలన కోసం మెప్మా ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు.

చిరు వ్యాపారులకు ప్రధానమంత్రి ఆత్మ నిర్భర్ పథకం ద్వారా రూ.10,000ల రుణాలు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా అడిషనల్ కలెక్టర్ పద్మజ రాణి, మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, మున్సిపల్ కమిషనర్ పి.రామాంజుల రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed