సిద్దిపేటలో మైనార్టీలకు ఇంటింటికీ నిత్యావసరాల పంపిణీ

by  |

దిశ, మెదక్: జిల్లా కేంద్రం సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు మంగళవారం పలువురికి నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. మొదట కొండా భూదేవి, కొండ మల్లయ్య, ,శివమ్స్ గార్డెన్స్‌ల్లో పేదలకు నిత్యావసర సరుకుల కిట్లను అందజేశారు. ఆ తర్వాత సిద్ధిపేటలోని ముర్షద్ గడ్డలో మైనార్టీలకు ఆటోల ద్వారా ఇంటింటికీ నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఆయన వెంట ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, వైస్ చైర్మన్ అక్తర్ పటేల్ తదితరులు ఉన్నారు. అనంతరం సిద్ధిపేట మున్సిపల్ కార్యాలయం ఆవరణలో క్రిమిసంహారక మందు స్ప్రే వాహనాన్ని ప్రారంభించారు. ఈ యంత్రాన్ని భవిష్యత్తులో పారిశుద్ధ్యం కోసం కూడా వినియోగించాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డికి ఆదేశించారు.

ఎన్నారై ఫోరం రూ. లక్ష విరాళం

విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సాయం అందించేందుకు లండన్ ఎన్నారైలు ముందుకు వచ్చారు. సిద్ధిపేటలోని మంత్రి నివాసంలో మచ్చ వేణుగోపాల్ రెడ్డి, ఏలూరి సతీష్ రూ. లక్ష చెక్కును మంత్రికి అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎన్నారై ఫోరం అధ్యక్షుడు ప్రమోద్, ప్రధాన కార్యదర్శి రంగుల సుధాకర్ గౌడ్, సంఘం ఫౌండర్ గంప వేణుగోపాల్, ప్రవీణ్ రెడ్డి, రంగు వెంటేశ్వర్లు, సుడా డైరెక్టర్ మచ్చవేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు.

tags :minister harish rao, carona, lockdown, nessecities supply, donation to cmrf

Next Story

Most Viewed