పల్లె పహాడ్ చరిత్ర తిరగ రాసింది..

42

దిశ, వెబ్ డెస్క్: ముంపు బాధితులను ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. పల్లె పహాడ్ గ్రామస్తులతో మంత్రి హరీశ్ రావు ఆదివారం సమీక్ష నిర్వహించారు. గతంలో పల్లె పహాడ్ ముంపు గ్రామంగా చరిత్రకెక్కిందని ఆయన అన్నారు. కాగా ఇప్పుడు టీఆర్ఎస్‌కు జై కొట్టి నేడు ఆ గ్రామం చరిత్ర తిరగ రాసిందని ఆయన అన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో సోలిపేట సుజాత గెలుపు ఖాయమని ఆయన తెలిపారు.