తెలంగాణ ప్రభుత్వం అన్నింటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది.. మంత్రి హ‌రీశ్‌రావు

by  |
harish
X

దిశ‌, ఎల్బీన‌గ‌ర్: తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్యానికే తొలి ప్రాధాన్యం ఇస్తుంద‌ని వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు అన్నారు. శుక్రవారం హ‌య‌త్‌న‌గ‌ర్‌లోని మాక్స్‌క్యూర్ హాస్పట‌ల్‌ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా వచ్చారు. వెంట ఆయ‌న శాస‌న‌మండ‌లి మాజీ చైర్మన్‌, ఎమ్మెల్సీ గుత్తా సుఖేంద‌ర్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు ఎగ్గె మ‌ల్లేశం, బోగార‌పు ద‌యానంద్‌ల‌తో క‌లిసి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. ప్రజారోగ్యాన్ని బ‌లోపేతం చేసేందుకు ప్రైవేట్ సెక్టార్ కూడా భాగ‌స్వాయ్యం కావాల‌ని కోరారు. ప్రజ‌ల‌కు త‌క్కువ ఖ‌ర్చుతో మెరుగైన వైద్య సేవ‌లు అందించేందుకు కృషి చేయాల‌ని కోరారు.

రాష్ట్రంలో గ‌త కొన్ని నెల‌లుగా పెండింగ్‌లో ఉన్న ఆరోగ్య శ్రీ బిల్లుల‌ను త్వర‌లో చెల్లించేలా చ‌ర్యలు తీసుకుంటున్నామ‌న్నారు. కొవిడ్ మూడో వేవ్ వ‌చ్చినా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దంగా ఉంద‌న్నారు. ప్రజ‌లు ఓమిక్రాన్‌పై ఆందోళ‌న చెంద‌వ‌ద్దని, క్రిస్మస్‌, న్యూఇయ‌ర్‌, సంక్రాంతి పండుగ‌ల వేళ ప్రజ‌లు త‌గిన జాగ్రత్తలు వ‌హిస్తూ అప్రమ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేర‌కు క‌రోనా థ‌ర్డ్ వేవ్ వ‌చ్చినా త‌ట్టుకునే విధంగా టిమ్స్‌, గాంధీ ఆసుప‌త్రులే కాకుండా మ‌రో 1600 ప‌డ‌క‌లు సిద్దం చేస్తున్నామ‌ని స్పష్టం చేశారు. నీలోఫ‌ర్‌లో 800 ప‌డ‌క‌లు, మ‌రో 6 ఆసుప్రతుల్లో 100 ప‌డ‌క‌ల చొప్పున ఏర్పాట్లలో వైద్యారోగ్యశాఖ నిమ‌గ్నమై ఉంద‌న్నారు.

21 ల‌క్షల హోమ్ ఐసోలేష‌న్ కిట్లను అందుబాటులో ఉన్నాయని చెప్పారు. వైద్యం మీద ఎక్కువ ఖ‌ర్చు పెడుతున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేన‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయ‌కులు గుత్తా జితేంద‌ర్‌రెడ్డి, మాజీ కార్పొరేట‌ర్ తిరుమ‌ల‌రెడ్డి, హాస్పట‌ల్ యాజ‌మాన్యం, సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed