అసత్యమేవ జయతే పద్దతిలో బీజేపీ ప్రచారం

81

దిశ, వెబ్‎డెస్క్ :
దుబ్బాక ఉపఎన్నికల నేపథ్యంలో బీజేపీ అసత్యమేవ జయతే పద్దతిలో ప్రచారం చేస్తోందని మంత్రి హరీష్ రావు విమర్శించారు. అబద్దాల పునాదుల మీద బీజేపీ ప్రచారం సాగుతోందని మండిపడ్డారు. కేసీఆర్ కిట్‎లో కేంద్ర నిధులు ఒక్క రూపాయి కూడా లేవని హరీష్ రావు స్పష్టం చేశారు. బీజేపీ నేతల ఇంట్లో డబ్బులు దొరికితే నాటకాలు ఆడారన్నారు. తప్పు చేసి, ధర్నాలు చేసి పోలీసులపై నిందలేశారని ఎద్దేవా చేశారు. బీజేపీ చేస్తున్న ప్రచారాన్ని దుబ్బాక ప్రజలు తిప్పి కొడతారని తెలిపారు.