మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌లో.. ‘కూపన్స్’ ఫీచర్

by  |
మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌లో.. ‘కూపన్స్’ ఫీచర్
X

దిశ, ఫీచర్స్: పల్లెల నుంచి పట్టణాల వరకు అంతా ‘ఆన్‌లైన్’ షాపింగ్‌కు అలవాటు పడిపోయారు. ఆన్‌లైన్ అంగడిలో ఓ రెండు, మూడు వెబ్‌సైట్స్‌లో ప్రొడక్ట్ ప్రైస్ చెక్ చేసిన తర్వాతే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తాం. ఎక్కడ తక్కువ ధర వస్తే, అందులో పర్చేజ్ చేస్తాం. అయితే షాపింగ్ ప్రియులకు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ షాపింగ్ సైట్లలో స్పెషల్ డిస్కౌంట్ కూపన్లను షో చేసే ఓ ఫీచర్‌ను టెస్ట్ చేస్తొంది. ప్రస్తుతానికి ఈ ఫీచర్‌ ఆండ్రాయిడ్ యూజర్స్‌కు మాత్రమే అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ ద్వారా మీరు ఆన్‌లైన్‌లో కూపన్ డిస్కౌంట్‌లను త్వరగా సులభంగా పొందవచ్చు.

సాధారణంగా భారతీయులు ‘ఆఫర్స్’ ‘డిస్కౌంట్స్’ను ఇష్టపడతారని ఇటీవలే ఓ సర్వేలో వెల్లడైంది. కానీ ఇండియన్స్ మాత్రమే కాదు ప్రతిఒక్కరూ ‘గుడ్ డిస్కౌంట్’‌ను ఇష్టపడతారు. ఈ క్రమంలోనే మైక్రోసాఫ్ట్ గత ఏడాది నవంబర్ నుంచి వినియోగదారులకు తన డెస్క్‌టాప్ బ్రౌజర్‌లో డిస్కౌంట్ కోడ్‌లను కనుగొనడంలో సహాయపడే షాపింగ్ ఫీచర్‌ను అందించింది. గూగుల్ తమ షాపింగ్ యాప్‌ సేవలు నిలిపేసిన ప్రస్తుత సమయంలో ఆండ్రాయిడ్‌ మొబైల్ డివైజ్‌లలో ఈ ‘కూపన్స్’ ఫీచర్ తీసుకురావడం ఆన్‌లైన్ షాపర్స్‌కు గుడ్‌న్యూస్‌ అని చెప్పొచ్చు. బ్రౌజింగ్ చేస్తున్న సైట్‌లో అందుబాటులో ఉన్న కూపన్ల గురించి బ్రౌజర్ వినియోగదారులకు స్క్రీన్ మీద చూపిస్తుంది.

షాపింగ్ సైట్ కూపన్స్ :

* మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ కానరీ తాజా వెర్షన్‌ వాడుతున్న ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ ఫీచర్ ప్రస్తుతానికి అందుబాటులో ఉంది. ఒకవేళ న్యూ వెర్షన్ వాడకపోతే, అప్‌డేట్ చేసుకోవాలి.

* అడ్రస్‌బార్‌లో ఎడ్జ్: //ఫ్లాగ్స్ అని టైప్ చేసి, ఎంటర్ బటన్ నొక్కాలి. అప్పుడు మీరు “షాపింగ్ సైట్ కూపన్లు” కు వెళతారు. దాన్ని ఎనేబుల్ చెయ్యడానికి టోగుల్ చేయాలి.

* ఇప్పుడు ఎడ్జ్‌ను ఓసారి రీస్టార్ చేయడంతో బ్రౌజర్ కొత్తగా ప్రారంభించిన సెట్టింగ్స్ రీడ్ చేసి న్యూ ఆప్షన్స్ షో చేస్తుంది.

* ఎడ్జ్‌ను రీస్టార్ చేసిన తర్వాత సెట్టింగ్ సెక్షన్‌లో జనరల్‌కు వెళ్లాలి. అక్కడ మీరు ‘కూపన్స్’ టోగుల్‌ను చూస్తారు. తర్వాత ఈ సెట్టింగ్‌ను ఆన్ చేయాలి.

ఇప్పుడు మీరు ప్రస్తుతం డిస్కౌంట్ ఇస్తున్న సైట్‌ను సందర్శించినప్పుడు సదరు షాపింగ్ సైట్ అందించే అన్ని కూపన్‌లను ఈ ఫీచర్ స్క్రీన్‌పై చూపిస్తుంది. ఆ కూపన్ కోడ్‌ను ఫైనల్ బిల్‌పై డిస్కౌంట్ పొందడానికి ఉపయోగించుకోవచ్చు.


Next Story

Most Viewed