పేషెంట్ బంధువుపై MGM సెక్యూరిటీ సిబ్బంది అత్యుత్సాహం

by  |

దిశ, పోచమ్మ మైదాన్: వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు. పేషెంట్ బంధువులపై దుర్భాషలాడుతూ శుక్రవారం హల్‌చల్ చేశారు. వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేట గ్రామంలో జరిగిన దాడిలో సంగా బుచ్చయ్య అనే వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో స్థానికులు ఆయన్ను వరంగల్ ఎంజీఎం‌కు తరలించారు. దాడి జరిగిన విషయం తెలిసిన బుచ్చయ్య బంధువు నరసింహ హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. దీంతో అతడిపై ఆసుపత్రి సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు. పేషెంట్‌ను చూడనివ్వకుండా అతనిపై దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డారు. ‘‘ఏం పీక్కుంటావో పీక్కో. నీతో ఏమీ కాదు. పోరా పో’’ అంటూ అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు. ఆసుపత్రిలో ఉన్న రోగులు, రోగుల బంధువులు అందరూ చూస్తుండగానే ఒక్కసారిగా నరసింహను చుట్టుముట్టి, దాదాపు కొట్టేంత పనిచేశారు. దీంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Next Story