నవంబరు 8న కుల సంఘాలతో మీటింగ్

by  |
నవంబరు 8న కుల సంఘాలతో మీటింగ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: మంత్రులు మళ్లీ బీసీ జపం చేస్తున్నారు. ఆత్మగౌరవ భవనాలపై ఫోకస్ పెట్టారు. వాటిని పూర్తి చేసేందుకు ఈ నెల 8న అన్ని కులసంఘాలతో సమావేశం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే సోమవారం మంత్రి గంగుల కమలాకర్ ఖైరతాబాద్ లోని మంత్రి కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వెనుకబడిన వర్గాలకు ఆత్మగౌరవ సభలను నిర్వహిస్తుందన్నారు. ప్రతీ కమ్యూనిటీ నుంచి ఏక సంఘంగా ఏర్పడిన వారికి వెంటనే ఆత్మగౌరవ భవన నిర్మాణాలను ప్రారంభించడంతో పాటు వాటి పర్యవేక్షణ బాధ్యతలను సైతం వారికే అప్పగించాలని అధికారులకు సూచించారు.

ఈ నెల 8న కుల సంఘాలతో సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రావెంకటేశం మాట్లాడుతూ.. కోకాపేట, ఉప్పల్ బగాయత్, బాటసింగారంలలో 40 కులాలకు 82.30 ఎకరాలను దాదాపు రూ.100 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించిందని, త్వరలోనే వేగంగా నిర్మాణాలను పూర్తి చేసేందుకు బీసీ సంక్షేమ శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తుందని అన్నారు. ఎంజేపీ సెక్రటరీ మల్లయ్య బట్టు మాట్లాడుతూ.. బీసీ గురుకులాల హాస్టళ్లు, భోజనశాలలతో పాటు క్లాస్ రూంలలో తగిన ఏర్పాట్లు చేశామని, విద్యార్థులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ సంధ్య, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed