మీ పొలంలో వేయాల్సిన పంట ఇదే!

by  |
మీ పొలంలో వేయాల్సిన పంట ఇదే!
X

దిశ, న్యూస్ బ్యూరో: ఎన్ని ఎకరాల్లో ఏ పంట వేయాలో దాదాపుగా ఖరారైంది. ఇప్పుడు రైతులు వారివారి పొలాల్లో ఏం పంట వేయాలో ఖరారు కావాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా కసరత్తు చేస్తూ ఉంది. ఈ నెల 21న ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ దీన్ని డిసైడ్ చేయనున్నారు. మంత్రులు, జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ అధికారులు, జిల్లాల రైతు సంఘం అధికారులు ఈ సమావేశంలో పాల్గొని ఫైనల్ చేయనున్నారు. నియంత్రిత పంటల సాగు విధానంపై గత కొన్ని రోజులుగా జరుగుతున్న కసరత్తు ఈ విస్తృత స్థాయి సమావేశంతో ఒక కొలిక్కి వస్తుంది. వరి, పత్తి, కందులు లాంటి పంటలను ఎన్ని ఎకరాల్లో సాగు చేయాలో ముఖ్యమంత్రి ఇప్పటికే చెప్పేశారు. ఇకపైన జిల్లాలవారీగా ఎంత విస్తీర్ణంలో ఏ పొలంలో ఏ పంట వేయాలో ఈ సమావేశంలో తేలుతుంది. ఒకవేళ ఫలానా జిల్లాలో వరి ఇన్ని ఎకరాల్లో నాట్లు వేయాలని నిర్ణయమైనట్లయితే ఏ రకం వరి వేయాలి, ఎంత వేయాలి లాంటివి ఈ సమావేశంలో డిసైడ్ అవుతుంది. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో వ్యవసాయాధికారులు, వ్యవసాయ యూనివర్సిటీ అధికారులు ఇప్పటికే సమావేశాలు మొదలుపెట్టారు. ఈ సమావేశం అనంతరం జిల్లాల వారీగా పంటల మ్యాప్ రూపొందుతుంది. ఆ పంటల మ్యాప్ పై ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో చర్చించి ఏ పంట వేయాలో నిర్ణయం జరుగుతుంది.

Next Story

Most Viewed