స్వాతంత్య్ర సమరంలో తెలుగు మీడియా కీలక పాత్ర

by  |
స్వాతంత్య్ర సమరంలో తెలుగు మీడియా కీలక పాత్ర
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో అంకితాభావంతో కీలకపాత్ర పోషించిన ఘన చరిత్ర నాటి తెలుగు మీడియాకు ఉందని రాష్ట్ర పోలీస్ హౌజింగ్ కార్పోరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా అన్నారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో “తెహెల్కా మీడియా నెట్ వర్క్” సంస్థ రూపొందించిన మీడియా డైరీ 2021 ఆవిష్కరణ సభకు ముఖ్య అతిధిగా కోలేటి దామోదర్ గుప్తా హాజరయ్యారు.

ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ మాట్లాడుతూ.. మీడియా స్వేచ్ఛ యాజమాన్యాలకు కాదని, జర్నలిస్టులకు ఉండాలన్నారు. నేడు రాజకీయ, పారిశ్రామిక వేత్తల కబంధ హస్తాల్లోకి మీడియా వెళ్లిపోవడంతోనే.. జర్నలిజం విలువలు దిగజారిపోతూ ప్రజల విశ్వాసాన్ని చురగొనలేక పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకప్పుడు మీడియాకు ఎంతో గౌరవం, విశ్వాసం ఉండేదన్నారు. జర్నలిస్టులను ప్రజలు న్యాయమూర్తులుగా ఆదరించేవారని.. అలాంటి పవిత్రమైన వృత్తిని రాజకీయ నాయకులు, పెట్టుబడి దారులు స్వప్రయోజనాల కోసం ధ్వంసం చేస్తున్నారని విరాహత్ మండిపడ్డారు.

తెలంగాణ యూనివర్సిటీ జర్నలిజం విభాగం అధిపతి ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ మాట్లాడుతూ.. జర్నలిజమంటే ప్రెస్‌మిట్లు, ప్రెస్‌నోట్లు కవర్ చేయడం కాదన్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నిస్వార్థంగా పనిచేయాలన్నారు. తెహెల్కా మీడియా నెట్ వర్క్ ఎడిటర్ చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ మేజీషియన్ సామల వేణుమాధవ్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed