అధిక గ్రీన్‌హౌజ్ ఉద్గారాలకు కారణం పాలు, మాంసం కంపెనీలే!

by  |
Meat Firms
X

దిశ, ఫీచర్స్ : జర్మనీ, బ్రిటన్ లేదా ఫ్రాన్స్‌ల కంటే ఎక్కువ గ్రీన్‌హౌస్ ఉద్గారాలకు దాదాపు 20 పాల కంపెనీలు బాధ్యత వహిస్తాయని తాజా నివేదిక వెల్లడించింది. కార్బన్ డయాక్సైడ్ ఉద్గారానికి డైరీ ఫామ్స్ గణనీయంగా దోహదపడుతున్నట్లు నివేదికలో తేలింది. ప్రపంచంలోని గ్రీన్ హౌజ్ వాయు ఉద్గారాల్లో 14.5 శాతం జంతు వ్యవసాయం నుంచే వస్తుండటం గమనార్హం. మీట్ అట్లాస్ 2021లో ప్రచురించిన నివేదికలో ఫ్రెండ్స్ ఆఫ్ ది ఎర్త్, యూరోపియన్ పొలిటికల్ ఫౌండేషన్, హెన్రిచ్ బోల్ స్టిఫ్టుంగ్ వంటి కంపెనీల అధ్యాయన రిపోర్ట్స్ స్పష్టంగా ఉన్నాయి.

వాతావరణ అత్యవసర పరిస్థితులను నివారించడానికి ధనిక దేశాలు మాంసం, పాల ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని శాస్త్రీయ నివేదిక పేర్కొంది. 2015-2020 మధ్య మాంసం, పాల కంపెనీలు $ 478 బిలియన్లకు పైగా బిజినెస్ జరిగిందని, నివేదిక ప్రకారం 2029 నాటికి మాంసం ఉత్పత్తి 40 మిలియన్ టన్నులు పెరిగే అవకాశం ఉందని నివేదిక తెలిపింది. అలాగే మీట్ అట్లాస్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మూడు వంతుల భూమి జంతువులను పెంచడానికి లేదా పంటలను పండించడానికి ఉపయోగిస్తున్నారని, బ్రెజిల్‌లో పశువుల పెంపకానికి దాదాపు 175 మిలియన్ హెక్టార్ల భూమిని వినియోగిస్తున్నట్లు పేర్కొంది. ఇది యూరోపియన్ యూనియన్ మొత్తం వ్యవసాయ భూమికి సమానం కాగా పశుసంవర్ధక రంగంలో కొనసాగుతున్న ఏకీకరణను ఈ నివేదిక హైలైట్ చేస్తుంది. పెద్ద కంపెనీలు చిన్న వాటిని కొనుగోలు చేస్తూ.. పోటీని తగ్గిస్తున్నాయని, ఇది మరింత స్థిరమైన ఆహార ఉత్పత్తి నమూనాలకు దారితీస్తుందని వెల్లడించింది. అయితే జంతు ప్రోటీన్ ఉత్పత్తి స్థాయిని కొనసాగించడానికి, పారిశ్రామిక జంతువుల పెంపకంతో కాలుష్యం కూడా పెరుగుతోంది. ఆయా దేశాలు మాంసం జంతు ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించాలని శాస్ర్తీయ నివేదిక తెలిపింది.

పశువుల నుంచి ఈయూలో సగటు(7%) గ్రీన్‌హౌస్ గ్యాస్ ఉద్గారాలు ప్రపంచ సగటు(14%) కంటే సగమని, ఇంగ్లాండ్, వేల్స్‌లో, జాతీయ రైతు సంఘం 2040 నాటికి వ్యవసాయంలో సున్నా గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని యూరోపియన్ అసోసియేషన్ డిప్యూటీ సెక్రటరీ జనరల్ పాలో పాత్రోనో వెల్లడించాడు.


Next Story

Most Viewed