బీచ్‌లో గొడుగు పట్టిన ‘క్రాక్’

by  |

దిశ, వెబ్‌డెస్క్: మాస్ మహారాజా రవితేజ అప్ కమ్మింగ్ మూవీ ‘క్రాక్’.. ఈ సినిమా పై అభిమానుల అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. తాజాగా చిత్ర యూనిట్ రవితేజ ఫోటోను సోషల్ మీడియాలో పంచుకుంది. గొడుగుపట్టిన రవితేజ బీచ్‌లో నడుస్తున్న ఓ స్టైలీష్ ఫోటో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఇది వరకే పోలీస్ డ్రెస్‌లో ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయడంతో సినిమా పై అంచనాలు భారీగానే పెరిగాయి. రవితేజ మరోసారి పోలీస్ గెటప్‌లో కనువిందు చేయనున్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్. తమన్ ‘క్రాక్‌’కు సంగీతం అందించగా.. శృతిహాసన్ ఈ సినిమాతోనే టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇస్తున్నారు.

Next Story