ఒంటరిగా వెళ్తున్నా మాస్క్ మ్యాండేటరీ.. హైకోర్టు కీలక ఆదేశాలు

by  |
ఒంటరిగా వెళ్తున్నా మాస్క్ మ్యాండేటరీ.. హైకోర్టు కీలక ఆదేశాలు
X

న్యూఢిల్లీ: కరోనా నిబంధనలను పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుకూలంగా ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. కారులో ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పటికి మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, కారును కూడా పబ్లిక్ ప్లేస్‌గా పరిగణించాలని తెలిపింది. ప్రైవేటు కారులో ఒంటరిగా వెళ్తున్నా చలాన్లు విధిస్తున్నారని, వీటిని నిలిపేయాలని ఢిల్లీ హైకోర్టులో కొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని విచారిస్తూ, శాస్త్రవేత్తలు, ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల ప్రభుత్వాలు మాస్కులు ధరించాలని సూచనలు చేస్తున్నాయని, కరోనా మహమ్మారి విసిరే కఠినమైన సవాల్‌ను ఎదుర్కోవడంలో మాస్కు కీలకపాత్ర పోషిస్తుందని భావిస్తున్నాయని ధర్మాసనం పేర్కొంది. టీకా వేసినా, వేసుకోకున్నా ఫేస్ కవర్ చేసుకోవడం ముఖ్యమని చెబుతున్నాయని వివరించింది. అలాంటప్పుడు మాస్కు ధరిస్తే తప్పేంటని ప్రశ్నించింది. మాస్క్ అనేది సురక్షకవచం లాంటిదని, దానితో వేసుకున్నవారు, వారి చుట్టుపక్కలనున్నారూ రక్షణ పొందుతారని తెలిపింది. కారులో ఒంటరిగా ఉన్నా మాస్కు ఎందుకు ధరించవద్దు అని అడిగింది. అది వారి సంక్షేమం కోసమే కదా అని వివరించింది.



Next Story

Most Viewed