ఆల్టో ఎట్ నంబర్ వన్..అమ్మకాల్లో అగ్రస్థానం!

by  |
ఆల్టో ఎట్ నంబర్ వన్..అమ్మకాల్లో అగ్రస్థానం!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆటో రంగంలో దేశీయంగా ఎన్నో రకాల మోడళ్లు ఉన్నాయి. ఏడాదికి పలు రకాల బ్రాండ్లు వినియోగదారులను ఆకట్టుకుంటూ ఉంటాయి. అయితే, వీటన్నిటినీ అధిగమించి జపాన్ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ వారి ఎంట్రీ లెవల్ మోడల్ ఆల్టో వరుసగా 16వ సంవత్సరం టాప్ వన్ స్థానాన్ని దక్కించుకుంది.

ఆల్టో మోడల్ కారు 26.4 శాతం తగ్గినప్పటికీ మొత్తం 1,90,814 యూనిట్ల అమ్మకాలతో టాప్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. 2005-06 ఆర్థిక సంవత్సరం తర్వాత 2 లక్షల కన్నా తక్కువ అమ్మకాలు జరగడం ఇదే మొదటిసారి. 2018-19లో దీని తర్వాతి స్థానాన్ని డిజైర్ మోడల్ 1,79,159 యూనిట్ల అమ్మకాలతో 29.4 శాతం క్షీణతను నమోదు చేసింది. అయితే, ఈ ఏడాది డిజైర్ మోడల్ నాలుగో స్థానానికే పరిమితమైంది.

ఈ ఏడాది ఆల్టో తర్వాత స్విఫ్ట్ కేవలం 3,000 యూనిట్ల తక్కువ అమ్మకాలతో 16 శాతం క్షీనించింది. మూడవ స్థానంలో కంపెనీ ప్రీమియం బ్రాండ్ బలేనో 1,80,413 యూంటిల అమ్మకాలతో 15 శాతం క్షీనించింది. మార్కెట్లో ఎక్కువగా రిచ్ ఫీచర్, సురక్షితమైన కార్లు అమ్ముడుపోతున్నాయి. దీంతో గత కొంత కాలంగా ఆల్టో విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. గతంలో ఆల్టో ఒక ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా 3,00,000 యూనిట్ల అమ్మకాలతో అగ్రస్థానంలో ఉండేది. గత అక్టోబర్‌లో ఎస్ ప్రెసో మోడల్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఆల్టో అమ్మకాలపై దీని ప్రభావం పడింది. దీనితో పాటు బలెనో, స్విఫ్ట్, డిజైర్ మోడళ్లలో డీజిల్ ఇంజిన్ వాల్యూమ్ అమ్మకాలు ఆకర్షించకపోవడంతో మరికొన్ని సంవత్సరాలు ఆల్టో అగ్రస్థానంలోనే కొనసాగే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

గతేడాది అత్యధికంగా అమ్ముడుపోయిన మరో మోడల్ మారుతీ వాగన్ ఆర్. 2019 ఫిబ్రవరిలో 1,56,724 యూనిట్ల అమ్మకాలతో 31 శాతం పెరిగి ఐదవ స్థానానికి చేరుకుంది. అలాగే, గతేడాది ఓమ్నీ వ్యాన్ మోడల్‌ను నిలిపేసి మారుతీ ఈకోను ప్రారంభించడంతో ఈకో అమ్మకాలు 27.4 శాతం పెరుగుదలను నమోదు చేశాయి. ఈకో 2019-20 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా అమ్ముడుపోయి ఆరవ స్థానంలో నిలిచింది. మారుతీ సొంత మోడల్ ఎస్‌యూవీ బ్రెజా టాప్ 10 కార్లలో 30 శాతం అమ్మకాలు తగ్గి ఎక్కువ పరాయజయాన్ని మూటగట్టుకుంది. ప్రస్తుతం బ్రెజా 7వ స్థానంలో ఉంది. హ్యూండాయ్ నుంచి మరో రెండు మోడళ్లు టాప్ 10లో ఉన్నాయి. ఎలైట్ ఐ 20, గ్రాండ్ ఐ 10 నియోస్. ఈ రెండు మోడళ్లు గత ఆర్థిక సంవత్సరంలో 20 శాతం అమ్మకాలను కోల్పోయాయి. టాప్ 10 తర్వాతి స్థానాల్లో మారుతీ ఎర్టిగా 39 శాతం వృద్ధిని సాధించగా, హ్యూండాయ్ క్రెటా 82,074 యూనిట్ల అమ్మకాలతో 34 శాతం తగ్గింది.

Tags: Maruti Suzuki Alto, Maruti Suzuki Alto 800, Maruti Suzuki, Maruti Alto, Alto 800, Suzuki, Maruti, Alto, 2020 Maruti Suzuki Alto



Next Story

Most Viewed