ఆ రోజుల్లో.. ఒకే వరసలో గురుడు, శని, అంగారక గ్రహాలు

by  |
ఆ రోజుల్లో.. ఒకే వరసలో గురుడు, శని, అంగారక గ్రహాలు
X

దిశ వెబ్ డెస్క్: దేశమంతా లాక్ డౌన్ కారణంగా .. గాలి స్వచ్ఛంగా మారింది. నీరు తేటగా మారాయి. పక్షులు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. ప్రకృతికి ఎంతో మేలు జరిగిందని పర్యావరణ ప్రేమికులు ఆనందపడుతున్నారు. కాలుష్య కోరల నుంచి బయటపడటంతో.. ఆకాశ తారలు మరింత అందంగా కనిపిస్తున్నాయి. దూరంగా ఉండే కొండలు స్పష్టంగా కానవస్తున్నాయి. ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతున్న ఈ దృశ్యాలతో పాటు.. కొద్దిరోజుల ముందు ఆకాశంలో ఏర్పడిన పింక్ సూపర్ మూన్ కూడా వారిని సంతోషపెట్టింది. ఆకాశంలో మరో ఖగోళ వింతను ఆస్వాదించే సమయం రాబోతుంది.

గురుడు, శని, అంగారక గ్రహాలను మార్నింగ్ ప్లానెట్స్ అని అంటారు. ఎందుకంటే.. అవి ఉదయం వేళల్లో స్పష్టంగా కనిపిస్తాయి. అయితే ఈ మూడు గ్రహాలు చంద్రుడితో కలిసి ఒకే వరసలోకి రాబోతున్నాయి. ఏప్రిల్ 14, 15, 16 తేదీల్లో ఈ అద్భుతాన్ని చూడొచ్చని శాస్ర్తవేత్తలు తెలిపారు. అమెరికాలో ఉండేవాళ్లకు ఇవి స్పష్టంగా కనిపిస్తాయని నాసా అంటుంది. అయితే మనం కూడా టెలిస్కోప్ సాయం లేకుండానే వీటిని వీక్షించవచ్చని ఖగోళ శాస్త్రజ్ఞులు అంటున్నారు. మరి వీటిని గుర్తుపట్టాలంటే.. సింపుల్ లాజిక్ ఉందని, చంద్రునికి సమీపంలోనే ఈ మూడు గ్రహాలు కూడా ఉంటాయని వారంటున్నారు. ఇప్పడు మిస్సయితే మళ్లీ వీటిని 2022లోనే చూడగలం. అంతేకాదు ఈ రోజుల్లో శుక్రుడు (Venus) మిగిలిన నక్షత్రాల కంటే ప్రకాశవంతంగా కనిపిస్తాడు.

tags :moon, saturn, mars, jupiter, venus, morning planets,



Next Story

Most Viewed