జోరు వర్షంలోనూ మాధవీ లత ప్రచారం.. తన గెలుపును ఏది అడ్డుకోలేదని ధీమా

by Mahesh |
జోరు వర్షంలోనూ మాధవీ లత ప్రచారం.. తన గెలుపును ఏది అడ్డుకోలేదని ధీమా
X

దిశ, వెబ్‌డెస్క్: మంగళవారం సాయంత్రం తెలంగాణ వ్యాప్తంగా భారీమ వర్షాలు కురిశాయి. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదిలా ఉంటే తెలంగాణలోని పార్లమెంట్ స్థానాల ఎన్నికలకు మరో ఆరు రోజులు మాత్రమే ఉంది. ఈ క్రమంలో హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి మాధవీ లత ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. తన నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో కాలినడకన తిరుగుతూ ఇంటింటికి చేరి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నేడు కురిసిన భారీ వర్షాన్ని సైతం ఆమె లెక్కచేయకుండా ముందుకు సాగారు. చేతిలో గొడుగు పట్టుకుని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నిన్నటి వరకు విపరీతమైన ఎండలు, ఈ రోజు భారీ వర్షం.. ఇవేవి తన పోరాటాన్ని ఆపలేవు. అలాగే హైదరాబాద్ లో ఈ సారి మేము కచ్చితంగా గెలుస్తాము. అందుకే వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఉత్సాహంగా ప్రచారం చేస్తున్నామని హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి మాధవీ లతా తెలిపారు.Next Story

Most Viewed