ఈ తప్పు మీరు కావాలనే చేశారా.. రిపోర్టర్ ప్రశ్నకు రాజమౌళి క్షమాపణలు!

by sudharani |   ( Updated:2024-05-07 15:10:09.0  )
ఈ తప్పు మీరు కావాలనే చేశారా.. రిపోర్టర్ ప్రశ్నకు రాజమౌళి క్షమాపణలు!
X

దిశ, ఫీచర్స్: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రాల్లో ‘బాహుబలి’ ఒకటి. రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎంతో పెద్ద విజయాన్ని సాధించడంతో పాటు.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. అయితే.. ఇంత పెద్ద విజయాన్ని సాధించిన ఈ చిత్రాన్ని ‘ది క్రౌన్ ఆఫ్ బ్లడ్’ పేరుతో యానిమేటెడ్ సీరిస్‌గా తీసుకొస్తున్నాడు రాజమౌళి. ఈ యానిమేటెడ్ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్‌ను కూడా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ హాట్ స్టార్‌లో రిలీజ్ చేశారు.

ఇక ‘బాహుబలి’ సిరీస్ గురించి తెలుసుకునేందుకు ఢిల్లీ, ముంబై నుంచి మీడియా వాళ్లు హైదరాబాద్‌కు వచ్చారు. ఈ క్రమంలోనే ఓ రిపోర్టర్.. రాజమౌళి గురించి గొప్పగా మాట్లాడుతూనే ఇన్నేళ్లల్లో ఎప్పుడూ మీరు మీటింగ్‌కు లేట్‌గా రాలేదు. ఇప్పుడు ఈ తప్పు తెలిసి చేశారా..? తెలియకుండా జరిగిందా..? అని ప్రశ్నించాడు. దానికి స్పందించిన రాజమౌళి.. ‘మీరు ఐదున్నరకు రమ్మన్నారు. మీరు ఇచ్చిన సమయానికే అంటే ఐదున్నరకే నేను ఇక్కడికి వచ్చాను. ఒకవేల నేను లేట్ వచ్చానని మీరు అనుకుంటే.. ఏమన్న ఇబ్బంది పడితే సారీ’ అంటూ చెప్తూనే.. ‘ది క్రౌన్ ఆఫ్ బ్లడ్’ యానిమేటెడ్ సిరీస్ మే 17వ తేదీన డిస్నీ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుందని తెలిపారు.

Advertisement

Next Story